జాతీయ మాల మహానాడు సారపాక పట్టణ అధ్యక్షులుగా చెలికాని శివరామకృష్ణ నియామకం. బూర్గంపాడు ( ప్రజా

Published: Saturday November 26, 2022

మండలంలోని సారపాక గ్రామానికి చెందిన చెలికానీ శివరామకృష్ణ ను జాతీయ మాల మహానాడు సారపాక పట్టణ అధ్యక్షులుగా, జాతీయ మాల మహానాడు బూర్గంపాడు మండల అధ్యక్షులు, పినపాక నియోజకవర్గం ఇంచార్జ్ పిల్లి రవి వర్మ  నియామక పత్రాన్ని శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు సారపాక పట్టణ అధ్యక్షులు చెలికాని శివరామకృష్ణ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, జాతీయ క్రమశిక్షణ అధ్యక్షులు, జిల్లా ఇంచార్జ్ అశోక భాస్కర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసు మల్ల సుందర్రావు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి టి రమణమూర్తి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడెల్లి గణపతి, నియోజకవర్గ ఇన్చార్జ్ పిల్లి రవి వర్మలకు కృతజ్ఞతలు తెలిపారు. సారపాక పట్టణంలో మాలల బలోపేతం కొరకు కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా బూర్గంపాడు మండల అధ్యక్షులు, పినపాక నియోజకవర్గ ఇన్చార్జ్ పిల్లి రవి వర్మ మాట్లాడుతూ గ్రామస్థాయిలో సంఘం బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. హలో మాల చలో వరంగల్ డిసెంబర్ 18న వరంగల్లో జరిగే మాలల సమరభేరి బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని అందుగ్గాను నియోజకవర్గంలో నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి దాసు, ఎస్ రవి, వినోద్, ఎస్ అశోక్, తదితరులు పాల్గొన్నారు..