ఘనంగా జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

Published: Thursday July 07, 2022
జగిత్యాల, జూలై, 06 ( ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్  60 వ జన్మదిన సందర్భంగా ఎంఎల్ఎ క్యాంప్ ఆపీస్ లో పట్టణ శాఖా ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ డా. భోగ. శ్రావణిప్రవీణ్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసినారు. స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మొక్కలు నాటినారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వొళ్ళం మల్లేశం, దూమల్ల రాజుకుమర్, ఆనంద్ రావ్, మరియు  కౌన్సిలర్స్, ప్రజా ప్రతినిధులు యువకులు కార్యకర్తలు అభిమానులు తదితులు పాల్గొన్నారు.