ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published: Thursday June 03, 2021
మేడిపల్లి, జూన్ 2 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర 7వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల 3వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని  కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, బింగి జంగయ్య యాదవ్, కో అప్షన్ సభ్యులు రంగా బ్రమ్మన్న జాతీయ జెండాతో పాటు టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త గోపాల్ గౌడ్, టీఆర్ఎస్ యువజన నాయకులు కొత్త విక్రమ్ గౌడ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు మేకల శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షులు చెప్పాలా రాజు, పురుషోత్తం రెడ్డి నాయకులు దిలిప్ రెడ్డి, సుధాకర్, మహేష్ గౌడ్, శ్రీరాములు, మహేందర్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.