వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్

Published: Saturday November 19, 2022

 జన్నారం, నవంబర్ 18, ప్రజాపాలన:  మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్, పిఎసిఎస్ కార్యాలయం, వివిధ గ్రామాలలో రైతులు కోసం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అమె తెలిపారు. మండలంలోని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా, ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను అమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ శ్రీపతి పద్మ, వైస్ చైర్మన్ గుట్ల రాజేష్ యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ శీలం రమేష్, మండల అధ్యక్షుడు గుర్రం రాజారాం రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, మండల కోఆప్షన్ సభ్యుడు మున్వర్  అలిఖాన్, జన్నారం ఎంపీటీసీ రియాజుద్దీన్, మండల ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, భరత్ కుమార్, సతీష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.