సీనియర్ రొటేరియన్ దిడ్డి సత్యం జన్మదిన వేడుకల

Published: Tuesday November 09, 2021
యాదాద్రి జిల్లా నవంబర్ 8 ప్రజాపాలన ప్రతినిధి: సీనియర్ రొటేరియన్ దిడ్డి సత్యం జన్మదిన వేడుకలను రోటరీ క్లబ్ ఆఫ్ పోర్ట్ భువనగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి దేవాలయం ప్రధాన కార్యదర్శి శబరి నగర్ భువనగిరి దిడ్డి సత్యం జన్మదిన వేడుకలను ఆదివారం నాడు రోటరీ క్లబ్ భువనగిరి సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. న్యూ క్లబ్స్ తెలంగాణ రీజియన్ చైర్మన్ డాక్టర్.ఎంపల్ల బుచ్చిరెడ్డి, ఎకనామిక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ తెలంగాణ రీజియన్ 3150 చైర్మన్ గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి శాలువా కప్పి పూలమాల తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటేరియన్ కలాషికం ఉపెందర్ రావు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.