ఇనగాలి గ్రామం లో ముమ్మరంగా సభ్యత్వ నమోదు ...

Published: Wednesday February 02, 2022
ఎర్రుపాలెం ఫిబ్రవరి 1 ప్రజాపాలన ప్రతినిధి: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధిర శ్యాసన సభ్యులు మల్లు భట్టివిక్ర ఆదేశాల మేరకు సోమవారం నాడు ఎర్రుపాలెం మండల పరిధిలోని ఇనగాలి గ్రామ సర్పంచ్ యరమల వెంకట రెడ్డి ద్వారా ముమ్మరంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. యరమల వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇనగాలి గ్రామం లో పలు వార్డులలో మహిళలు కూడా ఆనందంగా పిలిచి సభ్యత్వం తీసుకోవటం జరుగుతుంది. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ఇదే నిదర్శనం అన్నారు. లక్ష రూపాయలు రుణ మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇపుడు ఆ మాట మరిచి పోయింది అన్నారు. ఇనగాలి గ్రామంలో చురుకుగా సభ్యత్వ నమోదు అవుతుంది అన్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎర్రుపాలెం మండల యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ & ఇనగాలి గ్రామ ఏన్రోలర్ పంతంగి గోపిరాజ్ ఇనగాలి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు& ఏన్రోలర్ తల్లపరెడ్డి రత్నా రెడ్డి మొదలగువారు పాల్గొన్నారు.