పీర్జాదిగూడ పరిధిలోని జాతీయ రహదారి విస్తరణ పనులు జాప్యంపై సమీక్ష సమావేశం

Published: Friday December 10, 2021
మేడిపల్లి, డిసెంబర్ 9 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేషన్ పరిధిలోని వరంగల్ జాతీయ రహదారి పనులు వేగవంతంగా పూర్తి చేయుటకై కీసర ఆర్డివో రవి, కమిషనర్ డా.రామకృష్ణా రావు సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని జాతీయ రహదారి విస్తరణ పనులు జాప్యం జరుగుతోందని, అందుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఎలక్ట్రికల్ పోల్స్ &  ట్రాన్స్ఫార్మర్స్ షిఫ్టింగ్ మొదలగు పనులు సంబంధిత డిపార్ట్మెంట్ వారు త్వరగా పూర్తి చేయాలని కోరారు. మరియు నేషనల్ హైవే & ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కార్పోరేటర్లు భీంరెడ్డి నవీన్ రెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు బొడిగే రాందాస్ గౌడ్, నేషనల్ హైవే అథారిటీ డిఈఈ ఆర్.వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్ఆర్బి ఏఈ గోపికృష్ణ, మున్సిపల్ ఏఈ వినీల్, మండల గిర్దావర్ సునీత, మండల సర్వేయర్ తులసి, మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ సాయి నాగ ప్రసన్న కుమార్, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ టీం లీడర్ సి.ఆనంద్ రెడ్డి, నాయకులు బైటింటి ఈశ్వర్ రెడ్డి, గాయత్రి కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.