పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణికి కృష్ణమూర్తిచారి ఆర్థిక సాయం

Published: Friday February 12, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన : తెలంగాణ పవర్ లిఫ్టింగ్ ఆధ్వర్యంలో  స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ సొంతం చేసుకున్న పవర్ లిఫ్టర్ రేఖను ప్రోత్సహించాల్సిన అవసరం మన అందరిపై ఉందని శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు కే కృష్ణమూర్తి చారి అన్నారు. పవర్ లిఫ్టర్ రేఖ ముగ్గురు పిల్లల తల్లి అయినప్పటికీ తనకు ఉన్న పట్టుదలతో పవర్ లిఫ్టింగ్ లో తిరుగు లేని శక్తి గా ఎదిగిందని, ఆర్ధిక ఇబ్బందుల వల్ల ముందుకు వెళ్లడం లేదని గుర్తించి, ఆమె లోని పట్టుదలకు మెచ్చి సన్మానించి, రేఖకు 10,121 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగిందని తెలిపారు. మీరు కూడా మీకు తోచినంత సహాయం చేయగలరని కోరారు. హుండీలో వేసిన డబ్బు ఆ దేవుడి వరకు చేరుతుందో లేదో తెలీదు కానీ కష్టాల్లో ఉన్న వ్యక్తికి చేసిన సహాయం, వారు ఇచ్చే దీవెనలు వారి ఎదుగుదలకు ఉపయోగిపడతాయని కృష్ణమూర్ చారి ఆశాభావం వ్యక్తం చేశారు.