నూతన విద్యాశాఖ అధికారి కి సన్మానం

Published: Thursday September 23, 2021
ఎస్టియు టిఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 22 (ప్రజాపాలన) : ఇటీవల కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి గా పి అశోక్ పదవి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఎస్ టి యు టి ఎస్ ఆసిఫాబాద్ జిల్లా శాఖ  ఆధ్వర్యంలో బుధవారం మర్యాదపూర్వకంగా నూతన డిఇఓ ను కలిసి పూల మాల, శాలువాతో ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పుర్క మాణిక్ రావు, తుకారాం, నాయకులు రవీందర్, కిషన్, శారద సరస్వతి, మీ నాగేష్ జగన్నాథం  తదితరులు పాల్గొన్నారు.