ఔట్ సోర్సింగ్ నుంచి దరఖాస్తులు ఆహ్వానం

Published: Tuesday June 15, 2021
జిల్లా ఉపాధి కల్పనా అధికారి శేక్ అబ్దుల్ సుభాన్
వికారాబాద్ జూన్ 14 ప్రజాపాలన బ్యూరో : జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల ప్రకారము వికారాబాద్ జిల్లా లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో సపోర్టివ్ సర్వీసులను అందించడానికి ఎంప్యానలింగ్ కోరకు రిజిస్టరయిన, అర్హులైన  ఔట్సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనా అధికారి శేక్ అబ్దుల్ సుభాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టెండర్ ఫారాలను తేదీ:15-06-2021 నుంచి తేదీ:21-06-2021 వరకు ఆఫీస్ జిల్లా ఉపాధి కల్పనా కేంద్రము గవర్నమెంట్ ఐటిఐ కళాశాల, సుభాష్ నగర్ వికారాబాద్ పని వేళలలో పొందవచ్చును. తేదీ:22-06-2021 వరకు నింపిన టెండరు ఫారములని మధ్యాహ్నము 12:00 గంటల వరకు  దాఖలు చేయవచ్చును. అదేరోజు తేదీ:22-06-2021 మధ్యాహ్నము 3:00 గం.లకు సీల్డు టెండర్లు తెరవబడును. ఇతర వివరమలకు కార్యాలయ వేళలలో సంప్రదించగలరు.