నవంబర్ 21 న ఊరూరా ముదిరాజ్ జెండాలు ఎగరాలి : పిలుపునిచ్చిన ముదిరాజ్ మహాసభ నేతలు హైదరాబాద్ (ప్రజ

Published: Saturday November 19, 2022
నవంబర్ 21న ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవంతో పాటు ప్రపంచ
మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ లు
గ్రామ గ్రామాన పెద్దమ్మ తల్లికి ప్రతిరూపంగా ఉన్న పసుపుకుంకుమలతో కూడిన
ముదిరాజ్ జెండాను ఎగురవేసి, ముదిరాజ్ జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని ముదిరాజ్
మహాసభ రాష్ట్ర నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం సోమాజిగూడలోని ప్రెస్
క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహాసభ ఆవిర్భావ దినోత్సవ
మత్స్యకారుల దినోత్సవ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాసభ రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి చొప్పరి శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక బలమైన సామాజిక వర్గంగా ఉన్న ముదిరాజ్ లకు ప్రభుత్వపరంగా దక్కాల్సిన ఫలాలు పూర్తి స్థాయిలో దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేబినెట్ లో ఉన్న ఏకైక ముదిరాజ్ మంత్రి ని బయటకు పంపి ముదిరాజ్ ల ఆత్మ గౌరవం రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు. అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్ కులస్తులకు నేటి వరకు రాష్ట్రం చేసిందేమి లేదన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ లందరూ 21 న తమకు జరుగుతున్న అన్యాయం పై గళమెత్తాలన్నారు. ఈ కార్యక్రమం లో చొప్పరి శంకర్ తో పాటు ఆంజనేయులు, లక్ష్మీ నారాయణ, అశ్విని, సుధాకర్ ముదిరాజ్, మద్దెల సంతోష్, తెలంగాణ సంపత్, గంగాధర్, శివయ్య, అశోక్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.