రేగా కాంతారావు ఆధ్వర్యంలో అభివృద్ధిలో దూసుకుపోతున్న పినపాక నియోజకవర్గం యూత్ అధ్యక్షులు గ

Published: Tuesday October 18, 2022

భద్రాద్రి కొత్తగూడెం -అశ్వాపురం( ప్రజా పాలన.)
 రాష్ట్ర ప్రభుత్వ విప్ & BRS పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు మరియు పినపాక శాసన సభ్యులు శ్రీ రేగా కాంతారావు  ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు కోడి అమరేందర్  మరియు వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం  నియోజకవర్గ ఎస్సి సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్  సూచనల మేరకు మండల యూత్ అధ్యక్షులు గద్దల రామకృష్ణ ఆధ్వర్యంలో మండలంలోని అనుషక్తినగర్ గ్రామంలో రేగా భరోసా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామంలోని ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్  అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు నియోజకవర్గ వ్యాప్తంగా గౌరవ శాసన సభ్యులు శ్రీ రేగా కాంతారావు  చేస్తున్న అభివృద్ధి పనులను వివరిస్తూ గతంలో ఎన్నడు లేని విధంగా అద్భుతమైన పథకాలు కెసిఆర్  ప్రవేశ పెడుతున్నారని దేశం లోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందంచలో ఉందని మరియు పినపాక నియోజకవర్గం పై రేగా కాంతారావు  ప్రత్యేక శ్రద్ధతో  అభివృద్ధి పథంలో నడుస్తుందని, గ్రామ ప్రజలకు యువకులకు గద్దల రామకృష్ణ తెలియజేసారు.. అదే విధంగా అనుషక్తి నగర్ గ్రామ ప్రజలు, యువకులు స్మశాన వాటిక రోడ్డు సమస్య మరియు గ్రామం లోని రోడ్డు సమస్యను గద్దల రామకృష్ణ కు వినతి పత్రం  అందజేశారు మండలంలోని ముఖ్య నాయకుల సహకారంతో రేగా కాంతారావు  దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యను పరిష్కరిస్థామని వారికి తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో యువజన మండల ప్రచార కార్యదర్శి జూపెల్లి కిరణ్- యువజన నాయకులు రాసాల రమేష్ యాదవ్-రావుల అజయ్ -కన్నెబోయినా వెంకటేశ్వర్లు నాయక్ పోడు- బాధావత్ రమేష్ -మంద రాంబాబు -మడిపల్లి రమేష్ -ఇసంపల్లి సురేష్ కరకపల్లి డేవిడ్- గద్దల బాలకృష్ణ -గద్దల శ్రీనివాసరావు -అనుషక్తి నగర్ గ్రామ శాఖ అధ్యక్షులు నండ్రు సురేష్ -మడిపల్లి ప్రశాంత్ -కొమ్ము అశోక్ -నండ్రు జానకి రామ్- -ఉశికళ సతీష్ -కొమ్ము అశోక్ -గద్దల రాజశేఖర్ -కండె ఫణి -భాను ప్రసాద్ -శ్యామ్ -ఇశ్వర్ -నాగేశ్వరావు -మల్లెపు సంపత్-రాజేష్-హేమచంద్ర -చరణ్ తేజ-నరేష్-రాజు గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.