నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఫలితం టిఆర్ఎస్ బిజెపిలకు చెంపపెట్టు కావాలి : దండు నరేష్

Published: Friday April 09, 2021

యాదాద్రి, ఏప్రిల్ 8, ప్రజా పాలన ప్రతినిధి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా  కార్యాలయంలో పట్టణ ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు దండు నరేష్ మాట్లాడుతూ నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు మాజీ మంత్రి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన జానారెడ్డి గెలుపు రాష్ట్రంలో టిఆర్ఎస్ కు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలని అని అన్నారు, తెలంగాణ రాష్ట్రం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారు. అదేవిధంగా చిరుద్యోగులకు ఎలాంటి పనులు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా, ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం కెసిఆర్, బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీకి పట్టించుకోకపోవడం విడ్డూరం ఈ ఉప ఎన్నిక సందర్భంగా ఈ రెండు ప్రభుత్వాలు విచ్చలవిడిగా డబ్బులు పంచడం మద్యం పంచడం చేస్తున్నారు కానీ నాగార్జునసాగర్ ప్రజలు మాత్రం ప్రతి ఊరికి తాగునీరు, రోడ్లు, ఆరోగ్యశ్రీ కార్డు, ఫీజు రియంబర్స్మెంట్, ఉపాధి జాబ్ కార్డు, కల్పించిన అభివృద్ధి ప్రదాత జానారెడ్డి గారిని గెలిపించుకొని ఈ నియంత ప్రభుత్వాలకు బుద్ధి చెబుతారని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడమైనది.