45 సం.పై వారికి కరోనావ్యాక్సినేషన్ ప్రారంభం

Published: Wednesday March 31, 2021
నెల్లికుదురు మార్చి 30( ప్రజా పాలన ) : స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ కరోనా టీకాలు ఇచ్చే కార్యక్రమం మండల వైద్యాధికారివేదకిరణ్ ప్రారంభించగా ఎంపీపీఎర్రబెల్లి మాధవి నవీన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీదంపతులు ఎర్రబెల్లి మాధవి, నవీన్ రావులు టీకాలు వేయించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కరోనా బారినుంచి తప్పించుకోవడానికి వ్యాక్సినేషన్ చేయించుకోవడమే శ్రీరామరక్ష అన్నారు. డాక్టర్ వేద కిరణ్ మాట్లాడుతూ.. 45సంవత్సరాలు పైపడిన వారందరూ పీహెచ్సీకి వచ్చి టీకాలు తీసుకోవచ్చన్నారు. మొదటి డోసు టీకా తీసుకున్న తర్వాత 29 రోజులకు రెండవ డోసు తీసుకోవాలని సూచించారు కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బీరవెల్లి యాదగిరి రెడ్డి సూపర్వైజర్లు ఏ .సక్రి, సిహెచ్ మంగమ్మ, జి రవి ఏఎన్ఎంలు డి రోజ, కె రోజా రమణి వైద్య సిబ్బంది ఆశాలుతదితరులు పాల్గొన్నారు.