పోలీసులకు సహకరించాలని డిసిపి

Published: Saturday May 15, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం కరోనా నివారణకు రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల వరకు అమలు పరుస్తున్న లాక్డౌన్ ను మండల కేంద్రంలో యాదాద్రి భువనగిరి డిసిపి నారాయణ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి రెండవ దశ ఉదృతంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రభుత్వం 10 రోజులు లాక్డౌన్ విధించిందని, జిల్లా వ్యాప్తంగా ప్రజలకు కరోనా పట్ల తీసుకోవాలిసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారని, ప్రజలు అత్యవసరమైతేనే ఇంటి నుండి బయటకు వెళ్లాలని, వ్యవసాయ పనులకు, ఆసుపత్రులకు, ఉపాధి హామీ పనులకు వెళ్లే వారికి అనుమతిస్తున్నామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట సిఐ శ్రీనివాస్, స్థానిక ఎస్సై రాఘవేందర్ గౌడ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.