డాక్టర్ ప్రసాద రావు సేవల అభినందనీయం

Published: Thursday July 14, 2022
మధిర జులై 13 ప్రజా పాలన ప్రతినిధి డాక్టర్ ప్రసాద రావు సేవలు అభినందనీయమని వైయస్సార్ తెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్ పేర్కొన్నారు  అంతర్జాతీయ యాంటీ కరప్షన్ మరియు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తమిళనాడు శాఖ ద్వారా డాక్టరేట్ పొందిన వైయస్సార్ తెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా దళిత విభాగం ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మద్దెల ప్రసాద రావుని బుధవారం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లక్కినేని సుదీర్ మాట్లాడుతూ మద్దెల ప్రసాదరావు పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నుండి సిఐ వరకు పనిచేసే ప్రజలకు మెరుగైన సేవలు అందజేశారని ఆయన తెలిపారు వైయస్సార్ తెలంగాణ పార్టీ విధానాలు నచ్చి వైయస్ షర్మిల నాయకత్వంలో వైయస్సార్ తెలంగాణలో పార్టీలో చేరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ 
ఎస్టీసెల్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఇస్లావత్ రాంబాబు నాయక్  ముస్లిం మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్ పాషా  ఖమ్మం జిల్లా యువజన విభాగ అధ్యక్షులు పి రాఘవ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు గోరంట్ల రమేష్ బాబు ఎస్టి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ వీరు నాయక్ ఖమ్మం టౌన్ అధ్యక్షులు ఆలస్యం రవి తిరుమలాయ పాలెం మండల అధ్యక్షులు వాలూరి సత్యనారాయణ కూసుమంచి మండల అధ్యక్షులు వైవి డి రెడ్డి ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు ఎండపల్లి వెంకయ్య      నెలకొండపల్లి మండల అధ్యక్షులు గుగులోతు రూపుల నాయక్ ఏటుకూరి ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.