అడబిడ్డలకు వరం... కళ్యాణ లక్ష్మి పథకం

Published: Thursday January 20, 2022

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్.

కొడిమ్యాల, జనవరి 19 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండల పరిషత్ కార్యాలయంలో మండలానికి సంబందించిన 91,10,556 రూపాయల విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను 91 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. ఆడపిల్లల పెళ్లి 2014 ముందు "పేదవాళ్లు అప్పు చేసి పెళ్లి చేసేవారని టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామగా మారి ఒక్క లక్ష 116 రూపాయలను పేద ప్రజలకు చెక్కుల రూపంలో నేరుగా ఇస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేందుకు ఈ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం అడబిడ్డలకు ఒక భరోసాగా ఉందని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా ఇవ్వలేదని అన్నారు. భారతదేశంలో అడబిడ్డల పెళ్లిళ్ల కొరకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని కరోనా లాంటి సంక్షోభంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్  సంక్షేమానికే పెద్ద పీట వేశారని చొప్పదండి ఎమ్మెల్యే నుంకె రవిశంకర్  అన్నారు. సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  అధినాయకత్వంలో పురపాలక మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతోందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక పథకాలతో పేదలను అక్కున చేర్చుకున్న ప్రభుత్వ కెసీఆర్ ప్రభుత్వం ఒక్కటే అన్నారు. ప్రజలకు కావాలసిన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి. 'సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  మానస పుత్రిక అయిన కళ్యాణలక్ష్మి పథకం ఆడపిల్లకు ఓ వరం లాంటిదని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా, తెలంగాణ రాష్ట్రంలోనే అద్భుతమైన పధకం ఉండడం ఎంతో గర్వంగా ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో లేకున్నా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ రాష్ట్రంలో అమలు చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. నేటి పరిస్థితులలో ఆడపిల్ల పెళ్లి చేయడానికి, ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష నూట పదహారు రూపాయలు ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వమే అందజేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో కొడిమ్యాల మండల పరిషత్ అధ్యక్షులు మేనేని స్వర్ణలత, జెడ్పిటిసి పునుగోటి ప్రశాంతి సర్పంచుల ఫోరం మండలాధ్యక్షులు పునుగోటి కృష్ణారావు సింగిల్చిందో చైర్మన్ మేనేని రాజనర్సింగరావు, మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ మండల ఉపాధ్యక్షులు పర్లపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.