ఘనంగా జవహర్ నగర్ జర్నలిస్టుల ఐక్యవేదిక కార్యక్రమం

Published: Saturday November 05, 2022
జవహర్ నగర్ (ప్రజాపాలన ప్రతినిథి): ఐక్యమత్యమే మహాబలం అనే నినాదంతో జవహర్ నగర్ లోని జర్నలిస్టులంతా కలిసి ఏర్పరచుకున్న కార్యక్రమమే ఐక్యవేదిక ఇందులో ఎలాంటి ప్రెస్ క్లబ్ లకు  అవకాశం లేకుండ జవహర్ నగర్ జర్నలిస్టులందరినీ ఐక్యం చేయడం మరియు ప్రెస్ క్లబ్ శాశ్వత భవన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా ఏర్పరచుకొని ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం కాదని తెలుపుతూ జవహర్ నగర్ జర్నలిస్టుల ఐక్యవేదికలో తమయొక్క ఐకమత్యాన్ని చాటి కలిసి వచ్చిన కలం కవులు. 
జవహర్ నగర్  విలేకరులందరు కలుసుకుని పలు అంశాలను చర్చించుకుని జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి దాడులను మరియు జర్నలిస్టులు నేటి సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఖండిస్తూ, నిరాటంకంగా ముందుకు వెళ్లాలి అనే అంశాలు తెలియజేస్తు ఇక మీదట ఒక్క జర్నలిస్టుకు కూడా ఎలాంటి సమస్య రాకుండా అందరూ కలిసిమెలిసి ముందుకు సాగాలని తెలిపారు. జవహర్ నగర్ జర్నలిస్టుల మొదటి లక్ష్యం ప్రెస్ క్లబ్ నిర్మాణం. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలకై అందరూ కృషి చేయాలి. ప్రభుత్వానికి, అధికారులకి ,  ప్రజలకి  మధ్య సమస్యలను  తెలియజేసే ప్రజా గొంతుక అయినా  విలేకరులకు అన్ని పార్టీలనాయకులు, కార్పొరేటర్లు, అధ్యక్షులు ముక్త ఖంఠంగా ఇచ్చిన హామీ విలేకరులకందరికి ప్రెస్ క్లబ్ మరియు ఇండ్ల స్థలాల ఏర్పాటుకై  కృషి చేస్తామని చెప్పారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్  మాట్లాడుతూ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎం.పీ. రేవంత్ రెడ్డి సహాయంతో  ఐదు లక్షల రూపాయలు ప్రెస్ క్లబ్ నిర్మాణానికి ఇస్తామని తెలిపారు. తెరాస పార్టీ ప్రజాప్రతనిధులు మాట్లాడుతు వారి తరపున తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో సంప్రదించి జవహర్ నగర్ లో పనిచేస్తున్నటువంటి విలేకరులందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్  మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, టిఆర్ స్ సీనియర్ నాయకులు మేకల అయ్యప్ప, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్, మున్సిపల్ కార్పొరేషన్ తెరాస పార్టీ అధ్యక్షుడు భాషవోని కొండల్, మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు రంగుల శంకర్, మున్సిపల్ కార్పొరేషన్  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్, సిపిఐ పార్టీ కాప్రా మండల అధ్యక్షుడు యాదగిరి,    తెరాస కార్పొరేటర్లు జిట్టా వాణిశ్రీనివాస్, పానుగంటి బాబు, మురుగేష్, జమాలపూర్ నవీన్,  పల్లపు రవి,రాజ్ కుమార్,నిహారిక గౌడ్,  తెరాస సీనియర్ నాయకులు మెట్టు ఆశ వెంకన్న, బల్లి శ్రీనివాస్,భూమా పౌల్, ఆలూరి రాజశేఖర్, గుండ్రాతి కృష్ణ, అశోక్ గుప్తా, ఓబుల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ కింది ప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు ఇమ్మన్యుయేలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త కొండ వేణు, బీఎస్పీ పార్టీ అధ్యక్షులు బిర్రు యాకస్వామి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చారి, వికలాంగుల రాష్ట్ర అధ్యక్షుడు మొనర్ దుర్గప్రసాద్, మరియు ఇతర సంఘాల నాయకులు, అన్ని పార్టీల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.