నవంబర్ 28,29చలో ఢిల్లీ కరపత్రాల ఆవిష్కరణ శంకరపట్నం నవంబర్04 ప్రజాపాలన ప్రతినిధి

Published: Saturday November 05, 2022
శంకరపట్నం మండల కేంద్రం లోని అంబేద్కర్
విగ్రహం కూడలి వద్ద  తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మండల ఇన్చార్జ్ మెరుగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో  'చలో ఢిల్లీ' కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జలకాంతం పిలుపు మేరకు భారత నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఈ నెల 28,29 తేదీలలో చలో ఢిల్లీ కార్యక్రమం జంతర్ మంతర్ వద్ద భారత రాజ్యాంగ రక్షణ మహా ధర్నా కు ప్రజలు ప్రజాసామిక వాదులు మండలంలోని అన్ని గ్రామాల శాఖల సంఘం సభ్యులు లు వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని అంతే కాకుండా దేశ ప్రజలందరూ సమాన హక్కులతో జీవించాలనే లక్ష్యంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు
మనకందించిన భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని బిజెపి, ఆర్ ఎస్ ఎస్, చేస్తున్న కుట్రలు కుతంత్రాలను వ్యతిరేకంగా తిరుగుబాటు చేయవలసిన సమయం ఆసన్నమైందని కాబట్టి భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే లక్ష్యంతో  నూతనంగా నిర్మిస్తున్న అత్యంత భారత పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును నూతన భవనానికి నామకరణం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శంకరపట్నం మండలం నుండి 300 మందికి పైగా సంఖ్యలలో తరలి వెళ్లాలని మండల ఇంచార్జ్  మెరుగు  శ్రీనివాస్ పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శనిగరం ఐలయ్య,కార్యదర్శి శనగరం మహేష్,ప్రజా సంఘాల జేఏసీ మండల అధ్యక్షులు రవి యాదవ్, ఎం హెచ్ పి ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సముద్రాల సంపత్,దాసరపు భద్రయ్య, దామెర సతీష్,దేవనూరి వెంకటేష్, బుడిగ తిరుపతి, రామగిరి భూమన్న,రామారావు, అశోక్, సంపత్,ఆరెపల్లి ఓదెలు,సముద్రాల రాములు,
సముద్రాల సంపత్,గుర్రం సతీష్,మండల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.