పట్లూరులో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

Published: Thursday December 22, 2022
పబ్లిక్ హెల్త్ సెంటర్ చైర్ పర్సన్ ఎంపీపీ బట్టు లలిత రమేష్
వికారాబాద్ బ్యూరో 21 డిసెంబర్ ప్రజా పాలన : కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని పబ్లిక్ హెల్త్ సెంటర్ చైర్మన్ ఎంపీపీ బట్టు లలిత రమేష్ అన్నారు. బుధవారం మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు గ్రామంలోని పీహెచ్సీలో పట్లూరు గ్రామ సర్పంచ్ దేర దేశి ఇందిర అశోక్ అధ్యక్షతన పట్లూరు, కొత్లాపూర్ గ్రామాల గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పబ్లిక్ హెల్త్ సెంటర్ చైర్ పర్సన్ మర్పల్లి మండల ఎంపీపీ బట్టు లలిత రమేష్ మాట్లాడుతూ ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ పోషకాహారం ద్వారా అందించి రక్తహీనత తగ్గించి హిమోగ్లోబిన్ పెంచడమే లక్ష్యంగా న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. న్యూట్రిషన్ కిట్లలో కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, కిలో ఖర్జూర, ఐరన్ సిరప్ మూడు బాటిల్స్, 500 గ్రాముల నెయ్యి, ఆల్బెండజోల్ టాబ్లెట్, కప్పు, ప్లాస్టిక్ బాస్కెట్ ఏడు వస్తువులు ఉంటాయని వివరించారు. మర్పల్లి మండల జెడ్పిటిసి పబ్బె మధుకర్ మాట్లాడుతూ గర్భిణీలు పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యవంతంగా సంతాన ప్రాప్తి కలుగుతుందని తెలిపారు. గర్భిణీలకు ఏమాత్రము అసౌకర్యంగా శారీరక బడలిక కలిగినప్పుడు వెంటనే మీకు సమీపంలో ఉన్న పబ్లిక్ హెల్త్ సెంటర్కు వెళ్లాలని సూచించారు. కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పట్లూరు గ్రామ సర్పంచ్ దేవర దేశి ఇందిర అశోక్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం గా భావించి ప్రతి గర్భిణీ డాక్టర్లు సూచించిన విధంగా సమయానికి మందులు వేసుకోవాలని హితవు పలికారు. కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లను ప్రతి గర్భిణీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ మహిళల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్నారనడానికి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమమే నిదర్శనమని కొనియాడారు. పట్లూరు గ్రామంలోని 22 మంది, కొత్లాపూరు గ్రామంలోని  6 మంది గర్భిణీలకు మొత్తం 28 కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంగీత డాక్టర్ శంకరయ్య పబ్లిక్ హెల్త్ నర్స్ పుష్పలత హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తిరుపతయ్య సూపర్వైజర్ అమరేశ్వరి ఫార్మసిస్ట్ విజయ్ కుమార్ డాటా ఎంట్రీ ఆపరేటర్ గోవర్ధన్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.