నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి

Published: Friday August 06, 2021
బీజేవైఎం ద్విచక్ర ర్యాలీ
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు విజయ రాజు
వికారాబాద్ బ్యూరో 05 ఆగస్ట్ ప్రజాపాలన : ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు విజయ రాజు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో బీజేవైఎం పిలుపు మేరకు ద్విచక్ర ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌరస్తాలో బిజెవైఎం జిల్లా అధ్యక్షుడుు మాట్లాడుతూ సిఎం కేేసిఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని గద్దెనెక్కి ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని దెప్పపి పొడిచారు. ముఖ్యమంత్రి ప్రకటించిన నిరుద్యోగ భృతి రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని పేర్కొన్నాారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వివేకానంద రెడ్డి, శ్రీ కాంత్ రేడ్డి, సాయికృష్ణ, మహేష్, శ్రీమంత్ కుమార్, రవీందర్ గౌడ్ శ్రీ హరి, అశీష్ రేడ్డి, సాయి గౌడ్, భీమయ్య వివిధ మండలల బిజెవైయం నాయకులు పాల్గొన్నారు.