ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి

Published: Thursday January 05, 2023
* జిల్లా వైద్య అధికారి పాల్వన్ కుమార్
వికారాబాద్ బ్యూరో 4 జనవరి ప్రజా పాలన :
వికారాబాద్ జిల్లాలోని వైద్య, ఆరోగ్య శాఖలో  పాలియేటివ్ కేర్ కోసం ఒక ఫిజియో థెరపీస్ట్ ఉద్యోగ భర్తీ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య అధికారి పాల్వన్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియో థెరపీ నందు గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం నుండి డిగ్రీతో పాటు తెలంగాణ పార మెడికల్ బోర్డ్ నందు నమోదు చేయించుకొని ఉండాలన్నారు. ఈనెల 06 న
జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, వికారాబాద్ నందు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు.