అక్రమ అరెస్టులను ఖండించండి యు టి ఎఫ్, యు.యస్.పి.సీ బోనకల్ మండల కమిటీలు

Published: Wednesday December 29, 2021
బోనకల్, డిసెంబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి: 317 జీవో ద్వారా చేసిన బలవంతపు బదిలీలను నిలిపి వేయాలని, అనేక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వేలాది మందితో చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని యు.ఎస్ పి సి ఆధ్వర్యంలో నిర్వహించడమైనది . ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శించి సమస్యలు పరిష్కరించాల్సినది పోయి నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని టీఎస్ యుటిఎఫ్ బోనకల్ మండల కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆందోళనను పరిగణనలోకి తీసుకొని జీవో లో మార్పులు చేసి ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలని, అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి సమస్యలను పరిష్కరించాలని కోరుచున్నాము. సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని బోనకల్ మండల కమిటీ ప్రభుత్వానికి హితవు పలికింది. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి వల్లంకొండ. రాంబాబు, టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు బి ప్రీతం, మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, మండల ఉపాధ్యక్షులు కంభం రమేష్, ఉపాధ్యక్షురాలు పి.సుశీల, కోశాధికారి పి. పుల్లారావు పి.గోపాల్ రావు, చిన్న రంగారావు పి. నరసింహారావు, కే అనిల్ కుమార్, ఎం సి ఆర్ చంద్ర ప్రసాద్ శ్రీనివాస రావు, కే సౌభాగ్య లక్ష్మి, కె నాగలక్ష్మి, ఎం సైదారావు, టి. లక్ష్మి, ఎం నారాయణ రావు, యు ఎస్ పి సి నాయకులు బానోత్ రమేష్, సత్యజిత్, యాకూబ్ పాషా, తదితరులు ఉన్నారు.