వేసవి కాలంలో నీటి ఎద్దడిని నివారించాలి

Published: Friday March 19, 2021

కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం దినకర్
ఆసిఫాబాద్ జిల్లా(ప్రజాపాలన
ప్రతినిధి) : రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా అధికారులు, నాయకులు, నీటి ఎద్దడిని నివారించాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం దినకర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామాలలో ఎండాకాలం వచ్చిందంటే జిల్లాలోని ప్రజలు తాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నారన్నారు. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాలలో వర్షాధార నీటి పైనే వారి జీవనాన్ని సాగిస్తున్నారన్నారు. గుట్టల లోని చెలిమెల నుండి వచ్చే నీటిని తాగి అవసరాలు తీసుకుంటున్నారని అన్నారు. కానీ అధికారులు, నాయకుడు, ప్రజల పట్ల నిర్లక్ష్యం చేస్తూ బాధ్యతలు మరిచి పోతున్నారన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని ప్రజలు నీటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఉన్నత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జాడి మల్లన్న, నాయకులు కార్తీక్, రామయ్య లు  ఉన్నారు.