ఖజానా శాఖ గెజిటెడ్, నాన్-గెజిటెడ్ ఉమ్మడి జిల్లా సంఘం కార్యవర్గం ఎన్నిక జిల్లా ఖజానా శాఖ సహాయ

Published: Friday January 06, 2023

ఖజానా శాఖ గెజిటెడ్, నాన్-గెజిటెడ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు జిల్లా ఖజానాశాఖ సహాయ సంచాలకులు ఎ.సంజయ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గెజిటెడ్ సంఘంలో కోశాధికారిగా సంపత్ ఎస్.టి.ఓ. -లక్షెట్టిపేట, ఉపాధ్యక్షుడు-1గా రాజా సాహెబ్ డి.టి.ఓ. - మంచిర్యాల ఏకగ్రీవంగా ఎన్నిక కాగా నాన్-గెజిటెడ్ సంఘం ప్రధాన కార్యదర్శిగా డి. శ్రీధర్, చెన్నూర్ కోశాధికారిగా టి. తిరుమలేశ్వర్, సాంస్కృతిక కార్యదర్శిగా జి.సతీష్, మహిళా కార్యదర్శిగా బి. పద్మ, కార్యవర్గ సభ్యులుగా నరేందర్, ఇర్ఫానాలను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. నూతనంగా ఎన్నికైన వారిని సంఘ సభ్యులు ఎ.డి. ఏ. సంజయ్, ఏ.టి.ఓ. సిహెచ్. రాజేష్, ఎస్.టి.ఓ.స్ ఆర్. లచ్చన్న, డి. సురేష్కుమార్లు ఘనంగా సన్మానించారు.