రైతుబంధు పై బ్యాంకర్ల వేధింపులు ఆపాలి

Published: Wednesday June 30, 2021

సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కూశం రాజన్న
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి జూన్ 29 (ప్రజాపాలన) : రాష్ట్ర ప్రభుత్వం రైతుల పంట రుణాల కోసం రైతులకు రైతుబంధుని ఇస్తుందని, రైతుబంధు పై బ్యాంకర్ల వేధింపులు ఆపాలని, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కూశం రాజన్న అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల రుణాలను ఆప వద్దని ఆర్థిక శాఖ మంత్రి బ్యాంకు అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు రైతులను పాత రుణాలు ఉన్నాయని, అవి కడితేనే రైతుబంధు మీకు ఇస్తామని రైతులను వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. దానితో రైతులు ఎవరికీ చెప్పలేని స్థితిలో ఉండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా లో వాంకిడి జైనూర్ మండలాలలో ఇద్దరు రైతులు బ్యాంకు అధికారులు రైతుబంధు అడుగుతున్నారని, అవి ఇవ్వడంలేదని, ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఒక ప్రక్క టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధును బ్యాంక్ అధికారులు ఆపవచ్చని నేరుగా రైతుల అకౌంట్లో డబ్బులు వేసుకుంటే, ఇంకొక బ్యాంక్ అధికారులు ఆ రైతు బంధుని ఆపి లాక్ చేయడం జరుగుతుందన్నారు. దానితో రైతులు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారని, ఈ సమయంలో రైతులకు అటు రైతుబంధుతో, పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేయాలని, హక్కు పత్రం ఉన్న రైతులకు రామ్ లోన్ రుణాలు కూడా ఇవ్వాలన్నారు. రైతులు రుణాలు అడిగితే కొన్ని బ్యాంకులలో రుణాలు ఇవ్వడం లేదని, వెంటనే ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు రుణాలను రైతులకు అందించాలని, రైతుల పైన బ్యాంక్ అధికారులు వేధింపులను ఆపాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు దుర్గ దినకర్, ముంజం ఆనంద్, గుడిసెల కార్తీక్ లు ఉన్నారు.