అంగన్వాడి సేవలను వినియోగించుకోవాలి

Published: Tuesday June 07, 2022

సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి

వెల్గటూర్, జూన్ 06 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం పాత గూడూర్ గ్రామంలో అంగన్వాడి బడిబాట అంగన్వాడీ ఉపాధ్యాయులు దండ వేణి పద్మ, పుప్పాల మంజుల,ఉసిక మల్ల మల్లేశ్వరి ఆధ్వర్యంలో సోమవారం బడిబాట ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ కొంగల జగదీశ్వర్ రెడ్డి, ఐ.సి.డి.ఎస్. సూపర్వైజర్ అండాలు హాజరైనారు. సర్పంచ్ మాట్లాడుతూ అంగన్వాడీ సేవలను ఉపయోగించుకోంటె పిల్లల ఎదుగుదలకు దోహదం చేస్తుందని ఆయన అన్నారు. సూపర్వైజర్ మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీలో పౌష్టికాహారంతో పాటు ఆటపాటలతో విద్య నేర్పుతానని ఈ సేవలను అందరూ ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో తల్లులు కవిత, జక్కుల సునీత, కల్పన, సుధా, మల్లేశ్వరి, డాక్టర్ రజిత, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మాధవి, ఏ.ఎన్.ఎం లక్ష్మి, కార్యదర్శి మరియు ఆశా వర్కర్లు ఏం.స్వప్న, కృష్ణవేణి, జి. స్వప్న,అంగన్వాడి పిల్లలు, మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.