కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పే యోచనలో సైదులునాయక్..? జిల్లా కాంగ్రెస్ నాయకుల తీరుపై అసంతృప్తి..

Published: Friday October 07, 2022
 పొంగులేటితో నడిచేందుకు సుముఖుత.. 
కొనిజర్ల, అక్టోబర్ 6 (ప్రజాపాలన న్యూస్):
 *కాంగ్రెస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు, కొనిజర్ల మండల వాసి, ఉప్పల చెలక మాజీ సర్పంచ్ బాదావత్ సైదుల్ నాయక్ ఆ పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. చిన్ననాటి నుండి కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం శ్రమించిన ఆయన ఆ పార్టీ జిల్లా నాయకుల తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అనేక సంవత్సరాలుగా సైదులు నాయక్ కృషిచేశారు. ఖమ్మం  మాజీ పార్లమెంట్ సభ్యులు రేణుక చౌదరి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ రావు అనుచరులుగా ఉంటూ నిత్యం ప్రజల్లో తిరుగుతూ పార్టీ బలోపేతానికి పాటుపడ్డారు.  ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఆ పార్టీ పదవుల నియామకాల్లో తనను అవమానించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఆయనకు ఎటువంటి పదవులు ఇవ్వకపోవడంతో ఆయన కొంత అలక బూనినట్లు సమాచారం. అసలే రానున్నది ఎన్నికల కాలం. ఈ నేపథ్యంలో వైరా నియోజకవర్గంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న సైదులు నాయక్ లాంటి నేతలను వదులుకుంటే ఆ పార్టీ నష్టపోయే పరిస్థితి ఉంది. గిరిజన నాయకుడిగా ఆ వర్గాల్లో వైరా నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లిన అనుచరులు, భారీగా కార్యకర్తలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటువంటి నేతను కోల్పోతే ఆ ప్రభావం వైరా నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తుంది. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర నేతలు పాదయాత్రలు చేస్తుంటే జిల్లాలో కొంతమంది పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా జిల్లా కాంగ్రెస్ నాయకత్వం జరిగిన పొరపాట్లు తెలుసుకొని  సైదులు నాయక్ కు అవకాశం కల్పించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందో.. లేదో మరికొద్ది రోజుల్లో తెలుస్తోంది.* 
 
 *పొంగులేటి వెంట నడిచేందుకు సుముఖత..?* 
 
 *ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెంట నడిచేందుకు సైదులు నాయక్ సుముఖుత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పొంగులేటితో టచ్ లో ఉన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే పొంగులేటి వెంట నడుస్తారని సమాచారం. ఏది ఏమైనప్పటికీ సైదులు నాయక్ కాంగ్రెస్ పార్టీని వీడితే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంది.*
 
 
 
Attachments area
 
 
 
 
Reply
Forward