స్థానిక అవసరాలకు కొరకు ఇసుక రీచ్ల ఏర్పాటు

Published: Thursday March 18, 2021

జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
మంచిర్యాల జిల్లా, మార్చి 17, ప్రజాపాలన ప్రతినిధి : జిల్లాలోని స్థానిక అవసరాల కొరకు ముల్కల్ల, గుడిపేట ప్రాంతాలలో ఇసుక రీచ్ల ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా గ్రామీణ నీటిపారుదల శాఖ, గనులు భూగర్భ శాఖ, రెవెన్యూ శాఖ, టి.ఎన్.ఎం.డి.సి., జిల్లా అధికారులతో ఇనుక రీచ్ల నిర్వహణకు మంజూరు చేసే అనుమతులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్థానిక అవసరాలకు ఇసుకను ప్రణాళికబద్దంగా వినియోగించాలని, ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడినట్లయితే కరిన చర్యలతో పాటు సంబంధిత వాహనం సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజన్య మండల అధికారి శ్యామలాదేవి, జిల్లా భూగర్భజల శాఖ ఏ.డి. బాలు, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి ఆంజనేయులు, టి.ఎన్.ఎం.డి.సి. అధికారి తారక రాజు, జిల్లా గ్రామీణ నీటిపారుదల శాఖ జిల్లా భూగర్భజల శాఖ అధికారి గణేశ్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.