నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Published: Monday August 16, 2021
నిమ్మలగూడెం, ఆగస్టు15, ప్రజాపాలన ప్రతినిధి : గాంధీ అంబేద్కర్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ బాల గంగాధర తిలక్ లాల్ బహదూర్ శాస్త్రి అల్లూరి సీతారామరాజు భగత్సింగ్ ఆజాద్ చంద్రశేఖర్ సుభాష్ చంద్రబోస్ లాంటి అనేక మంది మహానుభావులు తమ ప్రాణాలను పణంగా పెట్టి లాఠీ దెబ్బలు తిని జైళ్లలో మగ్గి ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమాలు చేసి బ్రిటిష్ వారి కబంధహస్తాల నుండి మన దేశ బానిస సంకెళ్లను తెంపి సముపార్జించిన స్వాతంత్రాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిమీద ఉందని నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మద్దెల శివ కుమార్ ఉద్ఘాటించారు 15 08 2021 నాడు నిమ్మలగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు మద్దెల శివ కుమార్ మాట్లాడుతూ భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం సమసమాజ స్థాపన కోసం తన అపరిమిత మేధస్సుతో రచించిన రాజ్యాంగం యొక్క ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందడం లేదని ఈ స్వాతంత్ర్య రాజ్యాంగం ఫలాలు పేద వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు అందరితో సమానంగా అందినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు గా భావించాలి అన్నారు తొలుత గ్రామ సర్పంచ్ శ్రీ బండి రమేష్ మరియు ప్రధానోపాధ్యాయులు మధ్యల శివ కుమార్ జాతీయ నాయకులు గాంధీ అంబేద్కర్ గారు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కోవిడ్ నిబంధనలను అనుసరించి నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో చివరిగా విద్యార్థినీ విద్యార్థులకు గ్రామస్తులు అందరికీ స్వీట్లు బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ బండి రమేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మద్దెల శివ కుమార్ లతోపాటు పంచాయతీ సెక్రెటరీ శ్రీ  ఇజ హెద్ సహా ఉపాధ్యాయులు ఎండి షఫీ ఉద్దీన్ వార్డు సభ్యులు స్కూల్ కమిటీ సభ్యులు బండి రమేష్ గ్రామ పెద్దలు బండి వెంకన్న శ్రీనివాస్ ఉష రాహుల్ భాను విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు