సిపిఎం, మరియు గ్రామ ప్రజల పోరాట పలితంగా తట్టి అన్నారం గ్రామ సర్వే

Published: Wednesday February 23, 2022

ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 22 ప్రజాపాలన ప్రతినిధి : తట్టి అన్నారం గ్రామంలో సర్వే నెంబర్ 127/2,127/3లో సిపియం పార్టీ  ఆధ్వర్యంలో సంవత్సర కాలంగా అనేక పోరాటాల ఫలితంగా ఈరోజు సర్వే చేయడానికి మోక్షం లభించింది, అనేక సంవత్సరాలుగా ఫారెస్ట్ భూమిలో. దొంగ పట్టాలు సృష్టించుకుని దాదాపుగా 15 ఎకరాల వరకు కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జాదారులు రెవెన్యూ అధికారుల అండతో ప్రజా ప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, కుమ్మక్కై రెవెన్యూ అధికారులను మరియు మున్సిపాలిటీ అధికారులను, మభ్యపెడుతూ సర్వే చేయకుండా అడ్డుకోవడం జరిగింది. ఈ భూమిని కబ్జా చేయడం లో పెద్దల అండతో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్న పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు, గ్రామ ప్రజలతో  పెద్ద ఎత్తున ఎమ్మార్వో కార్యాలయం ముందు  ధర్నా చేసి సర్వే చేసేంతవరకు ఇక్కడి నుండి కదిలేది లేదని మొండికె యడంతో రెవెన్యూ అధికారులు దిగివచి ఎట్టకేలకు ఈరోజు సర్వే చేసి ప్రభుత్వ భూమిని గుర్తించి బయటకు తీయడం జరిగింది, ఈ దెబ్బతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్లాట్లు చేసి, అమ్ముకున్న కబ్జాదారులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రెవెన్యూ అధికారులు పారదర్శకంగా సర్వే చేసి కబ్జాదారులకు, ప్రజా ప్రతినిధులకి భయపడకుండా ప్రభుత్వ భూమిని రక్షించి బయటకు తీయకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని. ఏర్పుల నరసింహ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి హెచ్చరించారు. ఈ సర్వే కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందర రెడ్డి, సర్వయ్య, చుక్క రవికుమార్. సుధాకర్, నల్ల మల్లయ్య, సర్వర్ ఖాజా, శంకర్ పాల్గొన్న బిక్షపతి ఎల్లేష్ శ్రీనివాస్ పాల్గొన్నారు