బ్రిడ్జి కులుతుందని మోరపెట్టుకున్న పట్టించుకోలేని అధికార యంత్రాంగం

Published: Friday April 29, 2022

మేడ్చల్ జిల్లా (ప్రజాపాలన ప్రతినిధి) : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చర్లపల్లి రాంపల్లి చెరువుల మధ్య నాలా పై ప్రమాదకరంగా మారిన బ్రిడ్జి.చర్లపల్లి చెరువు నుంచి మోడీ గృహాల పక్కగా ఇందిరమ్మ గృహ కల్ప దారి గుండా చర్లపల్లి చెరువు వైపుగా ప్రవహించే నాలా పై వంతెన కుంగిపోయి సరిగ్గా రెండు నెలలు అవుతుంది. అప్పట్లో హడావిడి చేసిన ఇంజనీరింగ్ విభాగం అధికారులు నామమా త్రపు చర్యలు చేపట్టి  వంతెనపై బారికేడ్లు పెట్టి చేతులు దులిపేసుకున్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ దిక్కుగా చూసిన దాఖలు లేవు. ఏ క్షణమైనా కూలేందుకు సిద్ధంగా ఉన్న బ్రిడ్జిపై నుంచి రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే దానికి బాధ్యులేవరు?. కాబట్టి ఏమాత్రం తాత్సారం చేయకుండా కూలేందుకు సిద్ధమైన బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను బందు చేయించి మరమ్మతు చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు