వరద బాధితులకు ఆపన్న హస్తం అందించిన బీసీ వెల్ఫేర్ గురుకుల ఉపాధ్యాయ బృందం

Published: Friday July 22, 2022
బోనకల్, జులై 21 ప్రజా పాలన ప్రతినిధి: టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వరద బాధితులు సహాయార్థం విరాళాలు, దుస్తువులు, వస్తు సామాగ్రిని సేకరించడం జరుగుతుంది. ఈ సేకరణలో భాగంగా బీసీ వెల్ఫేర్ ఎర్రుపాలెం గురుకుల ఉపాధ్యాయ బృందం తరుపున సుర్ణలతగారు, బీసీ వెల్ఫేర్ ఖమ్మం ఉపాధ్యాయ బృందం తరపున జహీదా, బీసీ వెల్ఫేర్ గురుకుల బోనకల్ ఉపాధ్యాయ బృందం తరఫున లెవెన్ సేకరించిన దుస్తులను గురువారం నాడు టీఎస్ యుటిఎఫ్ మండల కమిటీకి అందించడం జరిగింది. ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి గుగులోతురామకృష్ణ, మాట్లాడుతూ ఉపాధ్యాయులు సామాజిక స్పృహతో దుస్తులను అందించడం అభినందనీయమని, సమాజంలోని ప్రతి ఒక్కరు వరద బాధితులకు ఆపనహస్తం అందించాలని అన్నారు. బీసీ వెల్ఫేర్ ఉపాధ్యాయులు అందించిన దుస్తులను ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరద బాధితులకు అందించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. అదేవిధంగా ఉపాధ్యాయుల నుండి స్వీకరిస్తున్న విరాళాలను సైతం అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు బి ప్రీతం, మండల నాయకులు ఎం సి ఆర్ చంద్ర ప్రసాద్, పి గోపాల్ రావు, ఆర్ శ్రీనివాసరావు, బీసీ వెల్ఫేర్ రాష్ట్ర నాయకులు లెవిన్, అన్నం నాయుడు, చలపతి రావు, నాగభూషణం, రవికుమార్, అశోక్ , భవాని, ప్రవళిక, నరేష్, శివకృష్ణ, బాబురావు , శ్రీను తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area