కాంగ్రెస్ పార్టీలో బారీగా చేరికలు.

Published: Monday October 25, 2021
కండువా కప్పి పార్టీలో ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్సీ.
మంచిర్యాల బ్యూరో, అక్టోబర్ 24, ప్రజాపాలన : రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యం గా మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావు నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ కార్యకర్తలను చైతన్య పరుస్తున్నారు. ఈ నేపద్యంలో  మంచిర్యాల లోని ఏసీసీ మరియు ప్రేమ్ సాగర్ రావు గారి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. మంచిర్యాల పురపాలక సంఘ పరిధిలోని 11వ వార్డు 19వ వార్డులకు చెందిన గుమ్ముల కృష్ణంరాజు, నోరు చంద్రుడు, జంగిలి రమేష్, ఉట్నూరి సతీష్, రియజుద్దీన్, టిఆర్ఎస్, వివిధ పార్టీలకు చెందిన 300మంది  నేతలు కార్యకర్తలు వార్డు కౌన్సిలర్ జోగుల సదానందం-శ్రీలత ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు వారికి కాంగ్రెస్ కాండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంచిర్యాలలోని తాపీ మేస్త్రి సభ్యులు కాలేజ్ రోడ్డు, ఏసీసీ లోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ముందుకు రాగా ప్రేమ్ సాగర్ రావు  కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మంచిర్యాల నియోజకవర్గం లోని వివిధ మండలాలకు చెందిన సీనియర్ టిఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యేపై అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. కాగా వారిని బుజ్జగించేందుకు ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు స్వయంగా రంగంలోకి దిగారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నాయకులు, కార్యకర్తలు సంసిద్ధులు అవుతున్నారు. పార్టీలో సుదీర్ఘకాలం అంకితభావంతో పని చేసిన వారికి గుర్తింపు ఇవ్వకుండా అడ్డుకోవడాన్ని వారు ఖండించారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ డబ్బు సంపాదించేందుకు రాజకీయాల్లోకి రావడంలేదని ప్రజాసేవ చేయడానికి వచ్చానని తెలిపారు. పార్టీలకు భిన్నంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇంతకాలం అభివృద్ధికి నేర్చుకోకుండా సంక్షేమ ఫలాలను అందుకోలేక నరకయాతన పడుతు న్నారని ఆయన తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ప్రజల మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు.ఇప్పటికే మంచిర్యాల నియజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఎమ్మెల్యే గా అవకాశం వస్తే ఈ నియోజకవర్గానికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఉప్పలయ్య, పట్టణ అధ్యక్షులు అంకం నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మున్సిపల్ డిప్యూటి ఫ్లోర్ లీడర్ సంజీవ్, మజీద్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అర్కల హేమలత, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ బందరి సుధాకర్, పట్టణ మహిళ అధ్యక్షురాలు హేమలత, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సళ్ళ మహేష్, నాయకులు తాజ్, శ్రీరాముల మల్లేష్, పుదరి ప్రభాకర్, శ్రీపతి, తిరుపతి, రామ్మూర్తి, శ్రీపతి మల్లేష్, శ్రీను, సూరం సతీష్, విజయ్, పవన్ షకీల్, మహిళ నాయకురాళ్లు శైలజ, స్రవంతి, తదితరు లు పాల్గొన్నారు.