ఇబ్రహీంపట్నం ఆగష్టు తేదీ 6 ప్రజాపాలన ప్రతినిధి. . *చెరువులు కుంటలు బు

Published: Thursday August 04, 2022

చెరువులు కుంటలు బు కబ్జాదారుల నుండి రక్షించి,కబ్జాలకు పాల్పిడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి,ఇబ్రహీంపట్నం చెరువులో నిర్మిస్తున్న వాకింగ్ పార్కును వెంటనే అపెయాలని.రౌండ్ టేబుల్ సమావేశంలో  రాజకీయ, ప్రజ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు ఇబ్రహీంపట్నంలో  తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ అధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మా చెరువులు కుంటల కబ్జాలపై తీర్మానం పెట్టారు. దాని పై కాంగ్రెస్ పార్టీ నాయకులు మాల్ రెడ్డి రంగారెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య, సిపిఐ రాష్ట్ర నాయకులు కావలి నర్సింహ్మా, టిడిపి,రాష్ట్ర కార్యదర్శి జీలమోని రవీందర్,కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు జి.జయమ్మ,బిఎస్పి నాయకులు బోళ్ల గణేష్, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు బి సామేల్,ఎన్ పి ఆర్ డి జిల్లా కార్యదర్శి జెర్కోని రాజు మాట్లాడారు.చనమోని శంకర్ అధ్యక్షత వహించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్ రెడ్డి చెరువులు కుంటలు కబ్జాలు చెయిస్తున్నాడని అధికారులు కూడా ఎందుకు బయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మీ సంఘం చేసే పోరాటంలో బగస్వామ్యం అవుతమని సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
జిల్లాలో ఉన్న చెరువులు, కుంటలు పిరంగి నాలా రాచ కాల్వలను పట్టణీకరణ పరిశ్రమలు రియల్ఎస్టేట్స్ మాఫియా పేరుతో ఇబ్రహీంపట్నం, అబ్దుల్లపూర్మెట్, యాచారం, మంచాల, కందుకూర్, మహేశ్వరం, బాలాపూర్, షాద్నగర్, శంషాబాద్, శంకర్పల్లి, తదిర ప్రాంతాలు కబ్జాలకు గురవుతున్నాయి. అదేవిధంగా ఇబ్రహీంపట్నం చిన్న చెరువులో వాకింగ్ పార్క్ పేరుతో ప్రభుత్వ అధికారులు పాలక పార్టీ స్థానిక రాజకీయనాయకులు కలిసి చెరువు తూముకు అడ్డంగా పార్క్ నిర్మింస్తున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ప్రాంతంలోని డిల్లోని చెరువు, పందిరిగుండ్ల కుంట, కొత్త చెరువు, కజ్జర్ల వంపు వాగు, మంగలిపల్లి గ్రామంలో సురాయ కుంట, కొమటి కుంట, మంచి నీల్ల బావి కుంట, చర్లపటేల్ గూడ గ్రామంలో జక్కమ్మ చెరువు, సోమ సముద్రం, మేడిబాయి కుంట, దాసరి కుంట, జెవి వెంచర్స్ మరియు ప్రైవేటు ఇతర రియలెస్టేట్ సంస్థలు అబ్దుల్లాపూర్ మెట్ మండలం, తట్టి అన్నారంలో ఊరచెరువు, జంగారెడ్డి కుంట, తట్టఖాన కుంట, స్థానిక రాజకీయ నాయకుల అక్రమంగా కబ్జాలు చేసి మట్టిపోసి కూల్చి వేస్తున్నారు.బండ రావిరాల పుల్చర్లకుంట,కమ్మాలకుంట, కొత్తచెరువు, బాటసింగారంలో పిచ్చాయకుంట, కోహెడాలోని ఉమ్రాకాన్ గూడ చెరువు,కొత్తచెరువు,మొండికుంట తాల్లచెరువు,అయిలకుంట,బాచారం గ్రామంలో మేళ్ళకుంట, కుంటలోనికుంట, పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీలో ఈదుల చెరువు, మంచాల మండలం లింగంపల్లిలోని సత్రోనికుంట,బాలపూర్ మండలంలోని బడంగ్ పేట్ మున్సిపాలిటీలో బురన్ ఖాన్ చెరువు, తుము పగలగొట్టి చట్ట విరుద్దంగా నీరు బయటకు పంపుతున్నారు. సిద్దమొనికుంట,పెద్ద చెరువు తదితర ప్రాంతాలలో చెరువులు కుంటలను అక్రమంగా భూకబ్జాకు పాల్పడుతూ పెద్దఎత్తున సర్వనాశనం చేస్తున్నారు.దీంతో చెరువులు కుంటలు ఫిరంగి,(రాచ) కాలువలు నామ రూపం లేకుండా పోవడంతో నీరు లేక పోవడం వల్ల భూగర్భజలాలు అడుగంటిపోయి. ప్రకృతి పర్యావరణం దెబ్బతింటుంది. కావున చెరువులు కుంటలని శాటిలైట్ ద్వారా డిజిటల్ సర్వే చేసి ఎఫ్ఎల్ అద్దురాళ్ళు ఏర్పాటు చేయాలి. కబ్జాలకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేసింది.భవిష్యత్తులో అనేక రకాల ఉద్యమాలు చేస్తామని,హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు చనమోని శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు సి హెచ్ వెంకన్న, జిల్లా నాయకులు రావనమోని రాజు, జాల సురయ్యా, ఇబ్రహీంపట్నం మండలం అధ్యక్షులు పూల యాదయ్య,కుక్కల నరేందర్,రమేష్‌ ఉపాధ్యక్షులు కావాలి లక్ష్మణ్,శ్రీనివాస్,మహేష్, తదితరులు పాల్గొన్నారు.