రైతుల అభివృద్ధి సంక్షేమం దిశగా కృషి ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **

Published: Thursday November 03, 2022
ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 02 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలోని రైతుల అభివృద్ధి సంక్షేమం దిశగా సంబంధిత శాఖల సమన్యాయంతో కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోనికలెక్టర్ సమావేశ మందిరంలో బ్యాంకు అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఇతర జిల్లాల అధికారులతో నాబర్త్ ఎఫ్, సి, ఓ,(ఫార్మర్, ప్రొడ్యూసర్,  ఆర్గనైజేషన్)పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అధిక శాతం పత్తి, కంది, పంటలను,సాగు చేస్తున్నారని, రైతులు లావదాయకమైన పంటలు, ఆయిల్ ఫామ్ మంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలని తెలిపారు.మన ఊరు మన బడి కార్యక్రమములో భాగంగా జిల్లాలు మొదటి విడతలు251 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని, రూ 30 లక్షల పైబడి 18 పాఠశాలల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నా బర్త్డేడీ,ఏ,వో, శ్రీనివాసరావు, ఏ,డి,ఏ, మిలింద్,ఇరిగేషన్ ఈ ఈ గుణవంతురావ్, బ్యాంక్ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.