ఒప్పంద ఉద్యోగం కొరకు దరఖాస్తులు ఆహ్వానం

Published: Friday November 04, 2022
జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి లలితా కుమారి
వికారాబాద్ బ్యూరో 3 నవంబర్ ప్రజా పాలన : ఒప్పంద ఉద్యోగం కొరకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి లలితా కుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ, వికారాబాద్ మిషన్ వాత్సల్య( జిల్లా బాలల పరిరక్షణ విభాగం) లోని కాంట్రాక్ట్ ఉద్యోగం కోసం ఒప్పంద ప్రాతిపదికన ఈ  క్రింది తెలిపిన ఉద్యోగ నియమకాలకు అర్హులైన వికారాబాద్ జిల్లా స్థానిక అభ్యర్థుల నుండి దరఖాస్తులు కొరనైయనదని జిల్లా సంక్షేమ శాఖల అధికారిని లలితాకుమారి తెలిపారు.
ఉద్యోగం పేరు : సోషల్ వర్కర్ మహిళ( సోషల్ వర్కర్ ఫిమేల్  ) ,  ఖాళీల సంఖ్య  -01 , కేటగిరీ మహిళలు మాత్రమే , గౌరవ వేతనం నెలకు రూ .18,200 / - అర్హత మరియు అనుభవం : ( ఎ ) గుర్తింపు పొందిన యూనివర్సిటీ  నుండి సోషల్ వర్క్ / సోషియాలజీ / సోషల్ సైన్సు లో గ్రాడ్యుయేట్ చేయడం ఉత్తమం , ( బి ) పని అనుభవం గల అభ్యర్థికి వెయిటేజీ , ( సి ) కంప్యూటర్లలో ప్రావీణ్యం. ఉద్యోగం పేరు : అవుట్ రీచ్ వర్కర్ ( ఓఆర్డబ్ల్యూ ) , ఖాళీల సంఖ్య  -01 , కేటగిరీ పురుషుడు / స్త్రీ , గౌరవ వేతనం నెలకు రూ .10,400 / - అర్హత మరియు అనుభవం : ( ఎ ) గుర్తింపు బోర్డు / సమానమైన బోర్డు నుండి 12 వ తరగతి ఉత్తీర్ణత , ( బి ) మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ , ( సి ) పని అనుభవం గల అభ్యర్థికి వెయిటేజీ. ఉద్యోగం పేరు: శిశుగృహ మేనేజర్ : ఖాళీల సంఖ్య -01 , కేటగిరీ పురుషుడు / స్త్రీ , గౌరవ వేతనం నెలకు రూ .22,750 / - అర్హత మరియు అనుభవం : ( ఎ ) గుర్తింపు బోర్డు / సమానమైన బోర్డు నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్, సోషల్ వర్క్ / సోషియాలజీ /హ్యూమన్ రైట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజి, లా , పబ్లిక్ హెల్త్ కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్మెంట్ , ( బి ), మహిళా శిశు మరియు సామజిక రంగాలలో 3 సంవత్సరాల పని అనుభవం. ఉద్యోగం పేరు:  శిశుగృహ  సోషల్ వర్కర్ , కేటగిరీ పురుషుడు/ స్త్రీ, ఖాళీల సంఖ్య -01 , గౌరవ వేతనం నెలకు రూ .18,200 / - అర్హత మరియు అనుభవం : ( ఎ ) గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సోషల్ వర్క్ / సోషియాలజీ /సోషల్ సైన్సు లో  గ్రాడ్యుయేట్ చేయడం ఉత్తమం , LLB ,   ( బి ) మహిళా శిశు మరియు సామజిక రంగాలలో 2 సంవత్సరాల ఆపై పని చేసిన అనుభవం గల అభ్యర్థికి  తప్పనిసరి , ( సి ) కంప్యూటర్లలో ప్రావీణ్యం. ఉద్యోగం పేరు:   శిశుగృహ  ఆయా, ఖాళీల సంఖ్య -01, అర్హత: 10 తరగతి, గౌరవ వేతనం నెలకు రూ. 7800 / -వయోనిబంధనలు : క్రమసంఖ్య 1,2,3 మరియు 4 ఉద్యోగాలకు 25 సం.ల నుండి 35 సం.లు 5 వ ఉద్యోగానికి 25 సం.ల నుండి 50 సం.లు ( SC , ST , BC వర్గాలు & దివ్యాంగులకు 5 సం.ల వరకు సడలింపు ) 03 .11. 2022 నాటికి వయస్సు కలిగినవారు అర్హులు . 
పైన పేర్కొన్న ఒప్పంద ఉద్యోగాల యొక్క అర్హత మరియు అప్లికేషన్ ఫారాల కొరకు  దరఖాస్తులను జిల్లా మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలో నూతన కలెక్టరేట్ రూమ్ నెంబర్ S 9 మరియు 10. కార్యాలయంలో నవంబర్, 03 ఉదయం 10.30 గం.ల నుండి  దరఖాస్తులను స్వీకరించు దరఖాస్తులను సమర్పించవలసిన చివరి తేది నవంబర్,16 సాయంత్రం 5 గం.ల వరకు. అర్హత గల అభ్యర్థులు ధరఖాస్తు  ఫారం తో పాటు సంబంధిత ధ్రువపత్రాలను జత చేసి నేరుగా మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించవలెను  మరింత సమాచరం కొరకు మహిళా శిశు సంక్షేమ శాఖ, కలెక్టర్ కార్యాలయము నందు సంప్రదించగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది టెలిఫోన్ నెంబర్లను 9849672296, 9866168198  సంప్రదించగలరు.