ప్రైవేట్ వాహనాలకు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోకి అనుమతి లేదు

Published: Friday October 29, 2021

కోరుట్ల, అక్టోబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ కె కృష్ణ మోహన్ మాట్లాడుతూ మోటార్ వెహికల్ చట్టం ప్రకారం బస్టాండ్ ఆవరణ లోకి ప్రైవేటు వాహనాలను తీసుకురావడం బస్ డిపోకు ఇన్ గేట్ వద్దా అవుట్ గేట్ వద్ద ఉచిత మూత్రశాలలు ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం బహిరంగ మూత్ర విసర్జన ధూమపానం మద్యపానం బస్టాండ్ ఆవరణలో చేయడం జరుగుతుంది. చాలా రోజుల నుండి ప్రైవేటు వాహనాలు బస్టాండు లోపలికి రావడం నిషేధం అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ప్రజలు పట్టించుకోకుండా విచ్చలవిడిగా ప్రైవేటు వాహనాలు తీసుకురావడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అలాంటి ప్రమాదాలకు వారే బాధ్యత వహించాలి మేము కొంత సమయం ప్రజలకు ఇచ్చి చూస్తున్నాం అయినా కానీ మార్పు రాకపోతే స్థానిక మోటార్ వెహికల్ శాఖకు పోలీస్ శాఖకు బస్ స్టాండ్ ఆవరణ లోకి వచ్చిన వాహనాలను వారికి అప్పజెప్పడం జరుగుతుంది కాలేజీ నుండి ఇంటికి వెళ్లే సమయంలో బస్టాండ్ ఆవరణలో ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు ఆకతాయిలు అలజడి ఎక్కువ అయింది దీనిని వారి తల్లిదండ్రులు అలాగే పోలీసుశాఖ కూడా దృష్టి సారించాలని కోరుట్ల ఆర్టీసీ డిఎం విజ్ఞప్తి చేశారు.