ఘనంగా అయ్యప్ప స్వామి దివ్య పడిపూజ

Published: Monday December 19, 2022
శంకరపట్నం డిసెంబర్ 18 ప్రజాపాలన విలేఖరి:

శంకరపట్నం మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో కన్య స్వామి గూళ్ళ రాజు, లక్ష్మి దంపతులు అయ్యప్ప స్వామి దివ్య పడిపూజ గురు స్వామి చింతం సత్యనారాయణ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ పోలోజు సుమన్ శాస్త్రి వేదమంత్రాల పటించగా అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి దివ్య పడిపూజ నిర్వహించారు. కన్య స్వామి దివ్య పడిపూజ ఆద్యంతం కన్నుల పండుగగా జరిగింది. ఈ దివ్య పడిపూజకు శంకరపట్నం, మానకొండూర్ మండలాలలోని వివిధ గ్రామాల నుండి అయ్యప్ప స్వాములు హాజరయ్యారు. ఈ పూజా కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తిశ్రద్ధలతో ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజ చేసి, పైట తుళ్ళి ఆడి తన్మయత్వంతో మునిగి, భక్తులను మైమరిపించారు. ఇరుగు పొరుగునుండి వచ్చిన భక్తులు భక్తి జన రంజకంగా సాగుతున్న అయ్యప్ప భజన గీతాలను వింటూ... పరవశించి తన్మయత్వం చెందిన ఒక మహిళ అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అంటూ పూనకం వచ్చి ఊగిపోగా పూజారి సుమన్ శాస్త్రి అయ్యప్ప స్వామిని జపించి, మంత్రించిన కమండలంలోని నీటిని భక్తురాలి పై చల్లి శాంతింప చేశారు. అనంతరం కన్య స్వామి అయ్యప్ప స్వామి వారికి నైవేద్యం సమర్పించి దివ్యపడిని వెలిగించి, స్వామివారి పవళింపు సేవ చేసి పడిపూజ ముగించారు. తదనంతరం పలువురు ప్రముఖులు, ఇరుగుపొరుగువారు వీధిలోని దేవాలయానికి పోటెత్తినట్లుగా దివ్య పడిపూజ జరిగిన శ్రీ అయ్యప్ప స్వామిని దర్శించుకుని తరించారు. కన్య స్వామి గూళ్ళ రాజు దంపతులు అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు అందించారు. ఆపై దక్షిణ తాంబూలాదులను అందించి పాదాభివందనం చేశారు. ఈ పూజ కార్యక్రమంలో వివిధ గ్రామాల  గురు స్వాములు, ఇతర స్వాములు కేశవపట్నం నకు చెందిన గురుస్వాములు కన్నం భద్రయ్య, గాజుల శ్రీనివాస్, ఖమ్మం జయ రాములు, గొట్టేముక్కల సుధాకర్, కాటం వెంకటరమణారెడ్డి, పావురాల రమేష్, పాల వెంకటరెడ్డి, ప్రవీణ్ కుమార్, గుర్రం రాజు  స్వాములు, భక్తులు పాల్గొన్నారు.