2వ డోస్ వాక్సిన్ తోనే వ్యాది నిరోధకశక్తి పెరుగుతుంది : జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారిణి సంధ్

Published: Friday October 29, 2021
మధిర, అక్టోబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : ఈ రోజు ఖమ్మం జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారిణి Ch సంధ్య రాణి మేడం తన బృందంతో  phc దెందుకూరు మండల కోవిడ్ వాక్సిన్ స్పెషల్ ఆఫీసర్ గా తన బృందంతో తనిఖీ చేసి ఈ రోజు వాక్సిన్ సెంటర్స్ ఏవూరు ఎక్కడ నిర్వహిస్తున్నది పారా మెడికల్ సిబ్బందిని పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిహెచ్సి రికార్డ్స్ పరిశీలించారు. మరియు ఫీల్డ్ లెవల్లో రాయపట్నం మడుపల్లి గ్రామాల్లో వాక్సిన్ సెంటర్స్ ను విజిట్ చేసి  పారామెడికల్ సిబ్బందికీ పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి అర్హత గల 18+ మరియు సీనియర్ సిటిజన్స్ యువత రెండొవ డోస్ వాక్సిన్ తప్పక వేయుంచుకోవాలని సూచించారు. వాక్సిన్ పట్ల ఎలాంటి  అపోహాలు లేకుండ వేయుంచు కుంటే 100%వ్యాది నిరోధకశక్తి పెరుగుతుంది అని, కోవిడ్ బారిన పడకుండా కాపాడుకోవాలి అని సంధ్య రాణి సూచించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ శారదాశాంతి ఏసీడీపీఓ కమలప్రియా మేడం  icds సూపర్ వైజర్ సుజాత  Phc హెల్త్ సూపర్ వైజర్ స్ లంకా కొండయ్య hs సుబ్బలక్ష్మి hs కాంతలీల anm విజయ సునీల్ రాణి స్టాఫ్ నర్స్ లు అనూష వినిలా తదితరులు పాల్గొన్నారు.