బాల కళా ఉత్సవం గోడ ప్రతులను విడుదల చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్

Published: Monday November 28, 2022
బెల్లంపల్లి నవంబర్ 27 ప్రజా పాలన ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర, భాష మరియు సాంస్కృతిక శాఖ,  సహకారంతో ఈ నెల 30వ తేదీన బెల్లంపల్లి నిర్వహించే రాష్ట్రస్థాయి బాల కళా ఉత్సవం గోడ ప్రతులను మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ ఆదివారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి కళా వేదిక లో బాల కళా ఉత్సవ  కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమం పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించి, తీసుకువచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు టాలెంట్ డాన్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ జూపాక గోపి, ఆర్గనైజర్స్ గడ్డం రమణ, ఎండి అలీ, కళాకారులు సతీష్, తదితరులు పాల్గొన్నారు.