వృద్ధ తల్లిదండ్రులను పిల్లలు కంటికి రెప్పలా కాపాడాలి

Published: Friday September 30, 2022
జిల్లా రెవిన్యూ అధికారి అశోక్ కుమార్
వికారాబాద్ బ్యూరో 29 సెప్టెంబర్ ప్రజా పాలన : వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వారి పిల్లలపై ఉన్నదని జిల్లా రెవిన్యూ అధికారి అశోక్ కుమార్ అన్నారు. వయోవృద్దుల సంక్షేమ వారోత్సవాలలో భాగంగా జిల్లా స్థాయి సెన్సీటైజషన్  కార్యక్రమం జిల్లా మహిళలు, శిశు, దివ్యాంగులు మరియు వయో వృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరములో నిర్వహించిన సమావేశంలో అయన పాల్గొని మాట్లాడుతూ,వృద్దులు సంక్షేమం, రక్షణ కొసం అనేక చట్టాలు ఉన్నాయని, ప్రభుత్వం తరపున కూడా ఎల్లపుడు సహకారం అందించడం జరుగుతుందని తెలిపారు.  వీరి సహాయం కొసం హెల్ప్ లైన్ నం, 14567 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వృద్దులు కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపర్చుకొని సమస్యలు తేలేత్తకుండా చూసుకోవాలన్నారు. వృద్దులు ప్రశాంతంగా జీవితం గడపాలని, నిత్యం క్రమం తప్పకుండా చేయాలని సూచించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలితా కుమారి మాట్లాడుతూ శాఖ తరపున వయో వృద్దులకు ఎల్లపుడు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని అన్నారు.  జిల్లాలో వయో వృద్దుల కొసం స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో రెండు ఓల్డ్ ఏజ్ హోమ్ లు కొత్తగడి, నవాబుపేటలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వయో వృద్దులకు ఎలాంటి సమస్యలు వచ్చిన మా శాఖకు లేదా ఆర్ డి ఓ గారిని  సంప్రదించాలని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 14567 కు కూడా కాల్ చేసి సంప్రదించవచ్చని తెలిపారు. వికారాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారి విజయకుమారి మాట్లాడుతూ, ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరించడానికి చట్టాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.  ఈ సమావేశంలో వయో వృద్దులతో పాటు వారి పిల్లలను కూడా రప్పించి ఉంటే వారి అభిప్రాయాలను కూడా  తెలుసుకొనుటకు వీలుపడేదని అన్నారు.  వృద్దులపై జరిగే అన్యాయాలపై న్యాయ సహాయం కొసం ముందుంటామని అన్నారు. ఇప్పటి వరకు అందిన మూడు ఫిర్యాదులను కౌన్సిలింగ్ చేసి పరిష్కరించడం జరిగిందన్నారు.
డి యస్ పి సత్యనారాయణ మాట్లాడుతూ, ఎక్కువ సమస్యలు ఆస్తులు, డబ్బుల కొసం తలెత్తుతున్నాయని, ఇలాంటి కేసులు తేలేత్తకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామన్నారు.  పిల్లలు తమ తల్లి దండ్రులను బాగా చూసుకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అవసరముండదని, ఏమైనా సమస్యలు ఉంటే చర్చించుకొని పరిష్కరించుకోవాలన్నారు. వయో వృద్దులకు ఏమైనా సమస్యలు ఉంటే 100 కు డైలీ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో డి పి ఓ మల్లారెడ్డి, డి ఆర్ డి ఓ అడిషనల్ పి డి నర్సిములు, సీనియర్ సిటిజెన్ జనరల్ సెక్రటరీ జూక రెడ్డి, వయో వృద్దులు, రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.