అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ బియ్యం పంపిణీ చేయాలి

Published: Tuesday June 08, 2021

మంచిర్యాల టౌన్, జూన్07, ప్రజాపాలన : అర్హులైన ప్రతి కుటుంబానికి ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేయాలని కోరుతూ సోమవారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో లక్షేట్టిపేట మండల తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఎస్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించడంతో పేద ప్రజలు పనులు లేక ఉపాధి కోల్పోయారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో రేషన్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం 10 కిలోల బియ్యం, రాష్ట్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యం పంపిణీ చేస్తోందన్నారు. కేవలం రేషన్ కార్డు ఉన్నవాళ్లకు మాత్రమే బియ్యం ఇవ్వాలనే ఆలోచన సరైంది కాదని, గత రెండు, మూడు సంవత్సరాల క్రితం నుంచి రేషన్ కార్డు మార్పుల కోసం చాలామ దరఖాస్తు చేసుకున్న ఆన్ లైన్ సమస్యలతో ఇప్పటికీ కార్డులు అందలేదని ఆయన వివరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచితంగా 15 కిలోల బియ్యం పంపిణీ చేయాలని, పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో. డివైఎఫ్ఎస్ఐ మండల కన్వీనర్ మందపల్లి మహేష్, కో-కన్వీనర్, అడ్లూరి హరీష్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యాక్షుడు బైరం లింగన్న, నాయకులు డి. రమేష్, కె. రమేష్, యు. రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.