రాష్ట్ర వ్యాప్తంగా డిఫెన్స్ లీగల్ కౌన్సిల్

Published: Tuesday February 07, 2023
* ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయన్
వికారాబాద్ బ్యూరో 06 ఫిబ్రవరి ప్రజాపాలన : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  డిఫెన్స్ లీగల్ కౌన్సెల్  ఆఫీసును వర్చువల్ గా ప్రారంభించిన  తెలంగాణ ఉన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయన్, రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ   ఎక్సక్యూటివ్  చేర్మెన్ నవీన్ రావ్   లు ప్రారంభించారు. వికారాబాద్ కోర్ట్ ఆవరణలో ఏర్పాటు చేసిన డిపెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సెల్  ఆఫీస్లను  జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చేర్మెన్,  ప్రధాన  న్యాయముర్తి  కె.సుదర్శన్, సీనియర్ సివిల్ జెడ్జ్ డిబి శీతల్ లు ప్రారంబించారు.  టి. వెంకటేష్ .చీఫ్ డిపెన్స్ కౌన్సెల్ గా పి.రాము డిప్యూటీ డిపెన్స్ కౌన్సెల్ గా  బాధ్యతలు అప్పగించారు . అనంతరము  ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, ఈ లీగల్ ఎయిడ్స్ కౌన్సిల్ అనేది ఎవరైతే నేరారోపణ పొందిన వారూ న్యాయవాదిని పెట్టుకోలేని స్థితిలో ఉంటే వారి తరపున ఈ యొక్క లీగల్ ఎడ్ కౌసెల్ లను   అపాయింట్ చేస్తాము. వారితరపున కేసులను వీరు వాదించడము జరుతుంది. దీనివల్ల చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది.
 కేసులు ఏండ్ల తరబడి  కాకుండా త్వరగా పూర్తి అయ్యేవిదంగా  కృషిచేస్తారు. 
జాతీయ న్యాయసేవ అధికార సంస్థ   ఆలోచించి ఇలాంటివి పేద ప్రజలకు ఉపయోగ పదేవిదంగా  ఉచిత న్యాయసేవ అందేవిదంగా రూపొందించారు .
ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జేడ్జ్ కె.శ్రీకాంత్  న్యాయవాద బార్ ప్రెసిడెంట్ కొకట్ మాధవ్ రెడ్డి,    ప్రధాన కార్యదర్శి  జగన్, పబ్లిక్ ప్రసిక్యూటర్స్  అశోక్ కుమార్, నారాయణ గౌడ్, రాజేశ్వర్,అన్వేష్ సింగ్, సమీన బేగం, రమేష్ గౌడ్ మరియు  బార్ న్యాయవాదులు గోపాల్ రెడ్డి  గోవర్ధన్ రెడ్డి నాగరాజు లవకుమార్ యాదవ్ రెడ్డి  బాలయ్య  బస్వరాజ్  జనార్ధన్ రెడ్డి రమేష్ కుమార్  రాజు తో పాటు బార్ న్యాయవాదులు పాలుగొన్నారు.