కెసిఆర్ పాలన దిక్కుమాలిన పాలన: వైయస్సార్ టి పి అధ్యక్షురాలు షర్మిల

Published: Monday June 13, 2022
బోనకల్, జూన్ 12 ప్రజాపాలన ప్రతినిధి:ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 92 వ రోజు ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గం లో కొనసాగింది. మధిర మండలం మాడుపల్లి ,బయ్యారం రైల్వే క్రాస్ మీదుగా బోనకల్ మండలం మోటమర్రి, రాయన్నపెట, ఆళ్లపాడు గ్రామాల మీదుగా పాదయాత్ర చేసి గ్రామ ప్రజలను కలుసుకున్నారు. అడుగడుగునా ప్రజలు షర్మిలకి ఘనస్వాగతం పలికారు. గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను షర్మిలకి వివరించారు. వ్యవసాయం లో గిట్టుబాటు లేదని తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్లు అందడం లేదని,దరఖాస్తు చేసుకుని మూడెళ్ళయినా కొత్తగా పెన్షన్లు ఇవ్వలేదని వృద్దులు షర్మిల దృష్టికి తీసుకు వచ్చారు. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి రెండింతలు వడ్డీ తో కట్టాలని బ్యాంకులు వేదిస్తున్నట్లు ప్రజలు తమ సమస్యలను షర్మిల కి చెప్పారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారం లోకి వస్తె వైఎస్సార్ సంక్షేమ పథకాలు అన్ని అమలు చేస్తామని... సంక్షేమ తెలంగాణ అంటే ఏంటో తాము చూపిస్తామని హామీ ఇచ్చారు.మరోవైపు సీఎం కేసీఆర్ పై ..కేసీఆర్ 8 ఏళ్ల పరిపాలన పై షర్మిల ఘాటుగా స్పందించారు.
వైఎస్సార్ 5 ఏళ్లు మాత్రమే సీఎం గా ఉన్నారు.
ఆయన పథకాలు,ఆయన చేసిన అభివృద్ధిని ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు.వైఎస్సార్ తర్వాత వచ్చిన నాయకులకు అభివృద్ధి పై చిత్తశుద్ది లేదు.కేసీఆర్ కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ఏం చేశారు.
ఏ రకంగా అయినా ప్రజలను ఆదుకున్నారా,టీఆరెఎస్ పార్టీ నేతలు వాళ్ళ వ్యాపారాలు తప్పా ఎవరు బాగుపడలేదు.రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వ్యవసాయం పై అన్ని పథకాలు పెట్టి 5 వేలు ఇచ్చే రైతు బందు ఇస్తున్నారు.5 వేలు రైతు బందు ఇస్తే రైతులు కోటీశ్వరులు అవుతారా, ఈ సీఎం కి అసలు మద్దతు ధర అంటే ఏంటో కూడా తెలియదు. కేసీఆర్ పాలన ఒక దిక్కుమాలిన పాలన. పంట నష్టం జరిగితే పరిహారం ఇవ్వలేని దిక్కుమాలిన పాలన కేసీఆర్ ది. రైతు 60 ఏళ్ల లోపు చనిపోతే రైతు భీమా ఇస్తారట అంటే రైతులను 60 ఏళ్లలో చనిపోవాలని మీరే రైతు నుదుటిన మరణ శాసనం రాస్తారా,దేశానికి విత్తనాలు సరఫార చేస్తామని గొప్పలు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు వడ్లే కొనడం లేదని,
రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారు.
 రైతులనే కాదు..తెలంగాణ లో అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారు.వడ్డీలేని రుణాలు అని చెప్పి మహిళలను మోసం చేశారు.కేజీ టూ పీజీ అని చెప్పి విద్యార్థులను మోసం చేశారు.ఇంటికో ఉద్యోగము అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారు.నిరుద్యోగ భృతి అని మోసం చేశారు.ఉచిత ఎరువులు అని మోసం చేశారు.
57 ఏళ్లకే పెన్షన్ అని వృద్ధులను మోసం చేశారు.
మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి .మోస పూరిత హామీలతో కేసీఆర్ మీ ముందుకు వస్తున్నాడు.ఈ సారి దళితబందుకు తోడుగా ఎస్టీ బందు అంటారు. 516 వేల కోట్ల మిగులు బడ్జెట్ లో రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పు చేశారు. ఉద్యమ కారుడు కదా అని తెలంగాణ ను చేతిలో పెడితే అప్పుల తెలంగాణ గా మార్చారు. మంచోడు అనుకుంటే మంచం కోళ్లు ఎత్తుకు పోయే రకం లా కేసీఆర్ తయారయ్యారు.కేసీఆర్ ను ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం అమ్ముడు పోయింది.పశువుల్లా ప్రతిపక్ష నేతలు అమ్ముడు పోయారు. ప్రజల పక్షాన నిలబడేందుకు పార్టీ పెట్టాం.వైఎస్సార్ బిడ్డ గా హామీ ఇస్తున్న పెద్దాయన మాట నిలబెడతా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేద్దాం. మహిళ పేరు మీద ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు ఇస్తా. పోడు భూముల్లో పట్టాల అందరికీ ఇస్తా
ఆరోగ్య శ్రీ,ఫీజ్ రీయంబర్స్ మెంట్ పథకాలకు పెద్దపీట వేస్తా, మాట తప్పని మడమ తిప్పని వైఎస్సార్ బిడ్డ గా మాట ఇస్తున్న.ఆశీర్వదిస్తే వైఎస్సార్ సంక్షేమ తెలంగాణ ను తీసుకు వస్తా అంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మధిర నియోజక వర్గ కో ఆర్డినేటర్ కిషోర్ కుమార్ దొంతమాల,ఉమ్మడి ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్ గడిపెల్లి కవిత, అధికార ప్రతినిదులు పిట్ట రాం రెడ్డి,సత్యవతి,ప్రచార కమిటీ అధ్యక్షుడు నీలం రమేష్,బోనకల్ మండల అధ్యక్షుడు జ్ఞానెష్, మైనార్టీ నాయకులు మౌలాలి తదితరులు పాల్గొన్నారు.