మంచిర్యాల నుండి రసూల్ పల్లి వరకు జాతీయ రహదారి నిర్మించండి : ఎంపి వెంకటేష్ నేత

Published: Tuesday October 12, 2021
మంచిర్యాల బ్యూరో, అక్టోబర్ 11, ప్రజాపాలన : మంచిర్యాల నుండి రసూల్ పల్లి వరకి13 కిలోమీటర్ల వరకు నాలుగు వరసల జాతీయ రహదారి నిర్మించాలని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత పేర్కొన్నారు. సోమవారం ఎన్ హెచ్ ఎ ఐ చైర్మన్, సెక్రటరీ గిరిదర్ అమరనె ఐఎఎస్ గారిని మరియా దపూ ర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గం లోని పలు సమస్యలను ఆయనకు వివరించారు. మంచిర్యాల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుండి రసూల్ పల్లి వరకు గల 13 కిలోమీటర్ల జాతీయ రహదారి ప్రస్తుతం రెండు లైన్లు మాత్రమే ఉండటం వలన ప్రయానికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నిత్యం సింగరేణి కార్మికులు పెద్దపెల్లి మంచిర్యాల జిల్లాల ప్రజలు రాకపోకలు ఎక్కువ జరుగుతున్న సందర్భంగా దీని వలన ట్రాఫిక్ అంతరాయంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ 13 కిలోమీటర్ల జాతీయ రహదారిని నాలుగు వరసల జాతీయ రహదారిగా మార్చి డివైడర్ ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ తో పాటు 14 జంక్షన్ల సుందరీకరణ, 8 బ్లాక్ స్పాట్ ల నిర్మాణం పూర్తి చేసి ప్రమాదాలు నివారించి, ప్రమాద రహిత రహదారిగా మార్చాలని కోరారు.