నవ్య ఫౌండేషన్ పది సంవత్సరాలు పూర్తి కావడంతో సంబరాలు

Published: Tuesday December 14, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నంలో నవ్య పౌండేషన్ స్థాపించి నేటికి పదేళ్లు. నవ్య ఫౌండేషన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఫౌండేషన్ జనరల్ సెక్రెటరీ మడుపు వేణుగోపాల్ రావు ఇబ్రహీంపట్నం లోని వి.కె ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందుగా టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్ జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి  హాజరై ముందుగా నవ్య ఫౌండేషన్ చైర్మన్ శ్రీ రమ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పదేళ్ల కిందట నవ్య ఫౌండేషన్ సంస్థను ఏర్పాటు చేసి వేలాది మంది యువతకు పలు రంగాలలో శిక్షణ ఇస్తూ సామాజ సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు నవ్య పౌండేషన్ చైర్మన్ శ్రీ రమ్య, జనరల్ సెక్రెటరీ వేణుగోపాలరావు లను అభినందించారు. ఇక ముందు ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తాము నిర్ధారించుకున్న కర్తవ్యాన్ని పూర్తి చేయాలని కోరారు. వ్యక్తిత్వ వికాస నిపుణులు మేథా ఇంగ్లీష్ ఇనిస్టిట్యూట్ అధినేత చిరంజీవి తో ఈ నెలలో స్పోకెన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్, జాబ్ స్కిల్ డెవలప్మెంట్ తదితర కోర్సులలో శిక్షణ ఇవ్వడానికి ఒప్పుకుని హాజరైనందుకు  ఆయనను అభినందించారు. అనంతరం నవ్య ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలను ప్రత్యక్షంగా చూస్తున్నామని ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పది సంవత్సరాలలో ఇంత చేశారంటే ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారని భరోసా కలుగుతుందని మా తరఫున మేము సహకరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం సంస్థ జనరల్ సెక్రెటరీ వేణుగోపాలరావు మాట్లాడుతూ పది సంవత్సరాల్లో సాధించిన విజయాలు భవిష్యత్తులో చేయవలసిన కార్యక్రమాలు గూర్చి ఎమ్మెల్యేకు వివరించారు. ఫౌండేషన్ స్లాబ్ దగ్గరనుండి ఎన్నో ఆటంకాలు ప్రతిబంధకాలు ఎదురైనా పేద విద్యార్థులకు యువతకు శిక్షణ ఇస్తూ ముందుకు సాగుతున్నామని, అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఇంగ్లీషు అవసరమవుతుందని స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ ఈ నెలలో మొదలు పెడుతున్నా మని అందులో భాగంగానే మేధా ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ అధినేత చిరంజీవి గారిని ఒప్పించామని తెలిపారు. ప్రతి ఒక్క మహిళ, యువత ఎవరిపై ఆధారపడకుండా తన కాళ్లమీద తాను నిలబడే విధంగా శిక్షణ ఇచ్చి ఆత్మగౌరవంతో జీవించే విధంగా అనేకమంది సహకారంతో ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. గతంలో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్ల ప్రధానం, ఇటీవల పలు స్కూళ్లలో అంబేద్కర్ చరిత్ర పై వ్యాసరచన పోటీలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి పాఠశాలకు తొమ్మిది మంది చొప్పున ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందించడం జరిగిందని వేణుగోపాల్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకట రమణారెడ్డి, కౌన్సిలర్లు సునీత వెంకట్ రెడ్డి, పి.శంకరయ్య, మేథా ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ అధినేత చిరంజీవి, ఎస్సై నాగేందర్, సంస్థ ఆర్గనైజర్లు పి.మహేందర్, మాజీ కౌన్సిలర్ జ్యోతి, అబేద, నస్రీన్, గుంటి జ్యోతి, మహేష్ మహారాజ్, ఉదయ్, తాళ్ల మహేష్, శశిధరప్ప, ముజకిర్, వనమల రవీందర్, విద్యా కమిటీ బుగ్గయ్య, జంగయ్య, సోమయ్య, శివరాజ్, రంజిత్ కుమార్, హర్షిత్ కుమార్ పాల్గొన్నారు.