అత్తాపూర్, అక్నాపూర్ గ్రామాలలో శుభోదయం కార్యక్రమం

Published: Saturday December 03, 2022
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
వికారాబాద్ బ్యూరో 02 డిసెంబర్ ప్రజా పాలన : గ్రామాలలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించడమే లక్ష్యంగా శుభోదయం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యటించి తెలుసుకుంటున్నానని తెలిపారు. శుక్రవారం నవాబుపేట మండల పరిధిలోని అత్తాపూర్ అక్నాపూర్ గ్రామాలలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కందాడ నాగిరెడ్డి ఆధ్వర్యంలో అత్తాపూర్ సర్పంచ్ స్వరూప భీమయ్య అక్నాపూర్ గ్రామ సర్పంచ్ తలారి అజయ్ కుమార్ సమక్షంలో గల్లీ గల్లీ తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం పార్టీలకతీతంగా అందజేయడం అభినందనీయమని కొనియాడారు. గ్రామాల ప్రజలకు ఆసరా పెన్షన్లు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ రైతుబంధు రైతు బీమా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసిఆర్ కిట్ వంటి పథకాలలో ఏదో ఒక పథకాన్ని లబ్ధి పొందుతున్నారని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ప్రజల బాగోగుల గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని కొనియాడారు. రాబోవు ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కు అండగా నిలవాలని ప్రజలను కోరారు. అనంతరం అక్నాపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి కార్యకర్తను కాలే యాదయ్య గుండెలో పెట్టుకొని చూసుకుంటాడని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కాలేజయమ్మ ఎంపీపీ కాలే భవాని ఏఎంసీ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ పిఎసిఎస్ చైర్మన్ రామ్ రెడ్డి టిఆర్ఎస్ యువ నాయకులు ఘణపురం శాంతు కుమార్ తదితర టిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అత్తాపూర్ ఆక్నాపూర్ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.