శివాలయంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిప్రత్యేక పూజలు...

Published: Monday February 20, 2023
రాయికల్, ఫిబ్రవరి 19 ;(ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం కొత్తపేట గ్రామ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో(శివాలయంల)పట్టబద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి  మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శనివారం రోజునప్రత్యేక పూజలు చేశారు.  ఈ సందర్భంగా అర్చకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని శాలువాతో సన్మానం చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనాలు అందజేశారు.
వారి వెంట బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు. గోపి రాజిరెడ్డి,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు.రవీందర్రావు,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడుగుండ మధు, కాంగ్రెస్ నాయకులు , తదితరులు ఉన్నారు.