మాలల అలయ్ బలయ్ కార్యక్రమానికి సన్నాహాలు - చెన్నయ్య

Published: Wednesday November 09, 2022
హైదరాబాద్ 8 నవంబర్ ప్రజాపాలన:
నల్గొండ జిల్లా మాల మహానాడు కార్యాలయంలో జిల్లా మాల మహానాడు కార్యకర్తల సమావేశం మంగళవారం నాడు జరిగింది. ఈ సమావేశం జిల్లా అధ్యక్షులు మల్ల మధుబాబు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.చెన్నయ్య జిల్లా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మాల మహానాడు ఆధ్వర్యంలో నల్గొండ ఉమ్మడి జిల్లా నందు మాలల అలయ్ బలయ్ కార్యక్రమాన్ని వచ్చే నెలలో మాల మహానాడు ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందుకు జిల్లాలోని అందరు మాలలు అభిమానులు భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. త్వరలోనే అలయ్ బలయ్ తేదీని ప్రకటిస్తామని తెలియజేశారు.మాలలకు జాతీయ మరియు రాష్ట్రస్థాయిలో జరుగుతున్న అన్యాయాల గురించి సంక్షేమ పథకాల గురించి మాలల పోరాటం అవసరం ఉందన్నారు. డిసెంబర్ లో జరిగే అలయ్ బలయ్  ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. మాలల మీద జరుగుతున్న రాజకీయ వివక్షత, అత్యాచారాలు, కుల హత్యలు, అగ్రకుల దాడులను తిప్పి కొట్టాలంటే మాలలు ఐక్యమై దళితుల ఐక్యతకు వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడుతూ రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు మాలలు అన్ని దళిత కులాలతో కలిసి ఉద్యమిస్తామని చెన్నయ్య  తెలియజేశారు.కార్యకర్తల సమావేశం అనంతరం మాల మహానాడు సీనియర్ నాయకుడు నల్గొండ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రేకుల భద్రాద్రి  సతీమణి క్రీ,.శే .రేకుల అన్నమ్మకు నివాళులర్పించి రేకుల భద్రాద్రిని  పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మేక వెంకన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు యనమల సత్యం, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జంగాల లక్ష్మమ్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగి ఆనందరావు, నాగార్జునసాగర్ నియోజకవర్గ అధ్యక్షులు లకు మల్ల లింగయ్య, మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు చింతమల్ల పాండు రంగయ్య, అనుముల మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నిడమనూరు మండల అధ్యక్షులు చింతమల్ల వెంకన్న, నాగార్జునసాగర్ అధ్యక్షులు కొచ్చర్ల సాగర్ మరియు ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.